మోడీ మంచి చెప్పం.. బొక్కలే వెదుకుతాం?
అయినా కూడా టిడిపి గెలవడంలో తమదే అసలైన పాత్ర అని చెప్పకనే చెప్పుకుంటుంది. అయితే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాల గురించి ఈమధ్య ఒక కార్టూను వ్యంగ్యంగా ప్రచురించింది. అయితే కేంద్రం ఎన్ని పథకాలు ప్రవేశ పెడుతున్న వాటి గురించి సానుకూలంగా స్పందించి కథనం ఇచ్చిన సందర్భం తక్కువ అని చెప్పాలి. దేశంలో ప్రతి పేదవాడికి కచ్చితంగా బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ రూపంలో ప్రవేశపెట్టింది.
ఈ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలన్నిటికీ రూపాయలు ఐదు లక్షల ఆరోగ్య భీమా వర్తిస్తుంది. మన కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఇబ్బంది కలుగుతుంది. సీరియస్ గా అతడు కచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఐదు లక్షల రూపాయల బిల్లు వచ్చిన కేంద్రమే చూసుకుంటుంది. ఒక అద్భుతమైన పథకం దీని గురించి కూడా ఎక్కువగా ప్రజల లోకి తీసుకువెళ్లడానికి ఎల్లో మీడియా ప్రయత్నం చేయదు.
చిరు వ్యాపారుల కోసం ముద్ర లోన్స్ తీసుకొచ్చి ఫైనాన్స్ భారీ నుంచి వారిని కాపాడింది. దీని గురించి పెద్దగా రాయరు. కేవలం తాము అనుకున్నది మాత్రమే రాసి అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అది నిజమని భావించేలా చేయాలని ఎల్లో పత్రికలు భావిస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.