ఐటీ రంగంలో ఆంధ్రాకు అవకాశాలు ఉన్నాయా?
అయితే ఈ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. పూర్తి చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు నడుపుతున్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్. కానీ హైటెక్ సిటీ పేరు చెప్తే వీళ్ళు ఎవరు గుర్తుకురారు ఒక్క చంద్రబాబు తప్ప. అంతగా హైటెక్ సిటీ పైన తన ముద్రను వేసుకు వచ్చారు చంద్రబాబు. మరి ఇంతగా ఆయన పేరు నిలిచిపోవడానికి కారణం ఆయన చేసుకొచ్చిన కొన్ని మార్పులు అని తెలుస్తుంది.
సరైన టైంలో హైటెక్ సిటీ కి సంబంధించి ఎల్ అండ్ టి టవర్ ను కట్టించాడు చంద్రబాబు. అంతే కాకుండా ప్లగ్ అండ్ పిన్ విధానాన్ని తీసుకువచ్చాడు. దాంతో హైదరాబాద్ లో హైటెక్ శకం మొదలైంది అని చెప్పవచ్చు. అయితే ఈ హైటెక్ రంగం ముందుకు వెళ్ళేది, లేనిది వచ్చే ఏడాది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
అది తెలుగుదేశం పార్టీనా లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనా అనే దాన్ని బట్టి ఈ హైటెక్ రంగం అనేది ముందుకు వెళుతుంది. కరోనా టైంలో విదేశీయులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం పేరుతో ఖర్చులు తగ్గించుకుని లాభాలు పొందాయని తెలుస్తుంది. కానీ ఆ తర్వాత మన ప్రభుత్వాలు ఈ పద్ధతి కుదరదని చెప్పేసరికి వాళ్లకు లాభాలు రావడం లేదట. దాంతో సెకండ్ గ్రేట్ సిటీస్ అయినటువంటి తిరుపతి, విజయవాడ, వైజాగ్ లలో తమ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తెరవడానికి చూస్తున్నారట.