సంక్షేమ పథకాలు సోమరిపోతుల్ని చేస్తున్నాయా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు సంక్షేమ పథకాలు డబ్బుల రూపంలో అందడం వల్ల కొంతమందికి లబ్ధి చేకూరితే మరి కొందరు వాటితో జల్సాలు చేసి సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత అయిదారేళ్లుగా ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడికి బిహార్, యూపీ, మహారాష్ట్ర నుంచి వచ్చి కూలీ పని చేసుకుని ఎంతో మంది బతుకుతున్నారు. కానీ ఇక్కడి యువత మాత్రం రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉపాధి మార్గాలను ఎంచుకోలేక సోమరిపోతులుగా తయారవుతున్నారు.  ఎన్నో పనులున్నా ఏమీ చేయలేని అసమర్థ జీవితం గడుపుతున్నారు.

దీనికి తోడు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. దీంతో యువత మొత్తం ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాల కోసం వెంపర్లాడటం పక్కా.. ఎందుకంటే రాజకీయ పార్టీల గురించి ఏమీ తెలియకున్నా.. వారిచ్చే మందు, విందు కోసం జెండాలు కట్టడం నుంచి జై కొట్టే వరకు నేతల వెంట ఉండి పని చేస్తారు. కూలీ వచ్చే కూడా పొలం, తోట పనులకు వెళ్లకుండా జెండా మోయడానికి ప్రచారానికి వెళ్తే రూ. 500 వస్తాయని అదే బాట పడతారు. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎలక్షన్ల టైంతో యువతను ఉపయోగించుకుంటున్నారు. ఇదే బాటలో రాజకీయ నాయకులు కూడా తమ పథకాలు ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా వారి మన్ననలు చూరగొనేలా చూసుకుంటారు.

వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అనగానే ఆయన గుర్తుకు వచ్చేలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి గొప్ప పథకాలు తీసుకురావడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించడం లేదు. టీడీపీ అన్నా క్యాంటీన్ తెచ్చింది. దాన్ని జగన్ సీఎం అయ్యాక తీసేసి..  ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో  ఆ ఎమ్మెల్యేగానీ వైసీపీ వారు కానీ రాజన్న క్యాంటీన్ లేదా ఇతర పేర్లతో నడిపిస్తున్నారు. దీంతో చాలా మంది పేదవారికైతే అన్నం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: