పవన్‌ రాజకీయాలకు 2 నెలలు విశ్రాంతి?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ నటుడు మాత్రమే కాకుండా ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు కూడా. ఆయన ఇప్పుడు రెండు పడవల్లోనూ కాలు పెట్టి ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ కూడా సమానంగా తన డేట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు అంటే వారాహి రథయాత్రకు ముందు వరకు  ఆయనపై ఒక అభిప్రాయం ఉండేది. అదేమిటంటే  సినిమా షూటింగులకు సెలవు ఉంటే గనుక రాజకీయ మీటింగులకు వస్తుంటారని.


అయితే మొన్న వరుసగా వారాహి1, వారాహి2, వారాహి3 అంటూ  నాన్ స్టాప్ గా తన రాజకీయ ప్రచార యాత్రను చేసుకుంటూ వచ్చారు పవన్. ఆయన మొదట తూర్పుగోదావరి జిల్లా, తర్వాత పశ్చిమగోదావరి జిల్లా, ఆ తర్వాత విశాఖపట్నం లలో తన రాజకీయ ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఆయన మొన్నటి వరకు రాజకీయాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకొంటూ వచ్చారు.


తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు ఆయన ఒక 50రోజులు  రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. తన డేట్స్ ఈ 50రోజులు  సినిమాలకు  అందివ్వనున్నారని తెలుస్తుంది. ఆ డేట్స్ కూడా  డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఇవ్వబోతున్నారట. అంటే సుమారుగా 60రోజులు, అంటే రెండు నెలల వరకు ఆయన రాజకీయ ప్రచారాలకు బ్రేక్ వేశారని తెలుస్తుంది.


ఎలాగూ నవంబర్, డిసెంబర్ లలో ఎన్నికల వాతావరణం వేడెక్కబోతుంది. ఒకవేళ నిజంగా ఎలక్షన్స్ కనుక ఫ్రీ పోన్డ్ అయితే అప్పుడు రాజకీయ పనుల్లో నిమగ్నం అవ్వడానికి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మూవీస్ కు తన డేట్స్ నాన్ స్టాప్ గా 60 రోజులు ఇచ్చారని అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఒకసారి ఈ షూటింగులు కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత ఆయన పొలిటికల్ ప్రచారాలలో  నిమగ్నమవ్వచ్చు. ఆ తర్వాత ప్రొడ్యూసర్లు వాళ్ల సినిమాలను వాళ్ళు ఒక పక్కన రిలీజ్ చేసుకుంటూ వస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: