జగన్‌ చేస్తే నేరం.. బాబు చేస్తే వరం..?

మొన్నటి వరకు ఇంటింటికీ జగనన్న అనే స్టిక్కర్లను అతికించే ప్రోగ్రాం వైసీపీ నాయకులు చేపట్టారు. గవర్నమెంట్ పథకాలు, వివిధ లబ్ధి పొందుతున్న వాటి గురించి తెలుపుతూ ఇంటింటికీ జగనన్న అనే స్టిక్కర్ ను అతికించారు. దీన్ని తెలుగు దేశం పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం పథకాలు ఇస్తున్నంత మాత్రాన ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడం ఏంటీ అని ప్రశ్నించింది. ఇలా చేయడం సరైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

కానీ కొంతమంది ఇది సరైనది చెప్పడం టీడీపీ దీన్ని వ్యతిరేకించడంతో ఇది కాస్త వివాదంగా మారిపోయింది. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు  సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఇంటింటికీ ప్రచారం చేయబోతున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇంటింటికీ స్టిక్కర్లు అతికిస్తున్నారు. వైసీపీ స్టిక్కర్లు అతికించుకున్న వారు టీడీపీవీ కూడా ఇంటి వద్ద అతికించుకోవాలని కోరుతున్నారు. ఒక వేళ నిరాకరిస్తే రాబోయే ప్రభుత్వం మాదే ఆ తర్వాత మీ పని చేస్తాం అని బెదిరిస్తున్నారు.

మొన్నటి వరకు స్టిక్కర్లు అతికించడం నేరంగా చూసిన టీడీపీ మళ్లీ అలాంటి పనే చేస్తుంది. వైసీపీ చేస్తే అది నేరంగా కనిపించింది. టీడీపీ మళ్లీ అదే పని చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ పెద్ద కుంభకోణం అని చెప్పే టీడీపీ, అధికారంలోకి వస్తే ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు వాలంటీర్లను పెడతామని చెబుతున్నారు. ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడుని నియమిస్తామని చెబుతున్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది. ఇక వెనిజులా, వెనకబడ్డ దేశాల మాదిరి తీవ్ర అప్పుల్లో కూరుకుపోతుందని టీడీపీ తెగ ప్రచారం చేసేస్తుంది. కానీ అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం అంతకుమించి ఎక్కువ పథకాలను ప్రజలకు అందిస్తామని చెబుతుంది. మరి అప్పులు చేయకుండా అంతకు మించి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబును పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: