చందమామ ఔట్‌.. ఇక సూర్యుడితో ఇస్రో గేమ్స్‌?

చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ తో దేశం ఉప్పొంగిపోతున్న వేళ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడి ఉపరితలం వద్దకు తన రాకెట్ ను పంపి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అంటే ఇప్పటి వరకు చంద్రుడి మీద ప్రయోగాలు చేసిన ఇస్రో సరికొత్తగా సూర్యుడి వైపు వెళ్లాలని భావిస్తోంది. ఇది వినూత్నం సరికొత్త ప్రయోగం. ఇప్పటి వరకు సూర్యుడి వైపు ఏ దేశ సైంటిస్టులు ఇలాంటి ప్రయోగాలు చేసిన దాఖలాలు లేవు.


చంద్రుడిపై ఇప్పటికే మూడు దేశాలు కాలుమోపాయి. ఒకటి అమెరికా, రష్యా, చైనా దేశాలు తమ ప్రయోగాలతో సక్సెస్ అయి మూన్ మీద సాప్ట్ ల్యాండ్ అయ్యాయి. కానీ అవన్నీ చంద్రుడి ఉపరితలంపై ఈజీ ప్లేస్ లో ల్యాండ్ లో అయ్యాయి. ఈక్విటర్ అనే ప్రాంతంలో అవి ల్యాండ్ కావడం ఈజీ. కానీ భారత్ పంపిన చంద్రయాన్ 3 అనేది చంద్రుడి దక్షిణ దృవం మీద ల్యాండ్ కావడం అనేది అత్యంత సాహాసోపేత నిర్ణయం అని తెలుసుకోవాలి. చంద్రుడి మీద పగలు 14 రోజులు, రాత్రి 14 రోజులు ఉంటుంది.


ఇలాంటి సందర్భంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువం మీద దిగేందుకు 40 రోజుల పైనే తీసుకుంది. అందులో ముందుగా భూకక్షలో తిరిగి ఆ తర్వాత చంద్రుడి కక్షలో తిరిగింది. అనంతరం చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టడానికి సైంటిస్టులు సమయం నిర్ధారించారు. అప్పటికే రష్యా లూనా 25 క్రాష్ ల్యాండ్ కావడం కూడా కాస్త కలవరానికి గురి చేసింది.


దీంతో చంద్రయాన్ 3 పై ఉత్కంఠ నెలకొని ఉండేది. కానీ దాన్ని పటా పంచలు చేస్తూ మన శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను సాప్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించారు. మరో వైపు ఇప్పుడు సూర్యుడి మీద ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. వీరికి భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: