వాలంటీర్ వ్యవస్థపై రూటు మార్చిన టీడీపీ?
ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి లబ్ధి పొందని వారి వివరాలు సేకరించి వారికి ప్రభుత్వం అందించే పథకాలను ఇచ్చేందుకు వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తుంది. అయితే దీనికి సంబంధించి పవన్ చేసిన ఆరోపణల గురించి ఎల్లో మీడియా కూడా వత్తాసు పలుకుతూ కథనాలు ప్రచురించింది. వాలంటీర్లతో ప్రమాదకరమని వారు చేస్తున్న అవినీతి తదితర విషయాల గురించి పుంఖాను పుంఖానులుగా వార్తలు రాసింది.
ప్రస్తుతం తన పంథా మార్చుకుని టీడీపీ అధికారంలోకి వస్తే దాదాపు 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. ప్రతి 60 మందికి ఇద్దరు వాలంటీర్లను నియమిస్తారని అంటున్నారు. అందులో ఒకరు మగ, మరొకరు ఆడ, వీరు ఆ ఆరవై కుటుుంబాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తారు. ప్రతి విషయంలో ఆ కుటుంబంతో మమేకమవుతారు. తద్వారా ప్రభుత్వం అందించే పథకాలు నేరుగా చేరువవుతాయని చెబుతున్నారు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పని కూడా అదేనని వాలంటీర్ ఒక్కరే ఉన్నారని దీన్ని కాస్త మార్చి ఇద్దరిని చేసి ఏదో కొత్తగా చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ వల్ల చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరగకుండానే వారికి అనేక పనులు అయ్యాయి. వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడో ఓ చోట లోపం ఉంటే మొత్తం వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.