కరోనా పాపం.. కేజ్రీవాల్‌ను వెంటాడుతుందా?

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ లో కనీసం శ్వాస పీల్చుకోవడం కష్టమై చనిపోయిన వారి సంఖ్య కొన్ని వేలల్లోనే ఉంది. దేశంలో కరోనా రెండో దశ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వచ్చిన ప్రతి 100 మందిలో దాదాపు సగం కంటే ఎక్కువ మంది ఆక్సిజన్ మీద ఉండాల్సిన భయానక పరిస్థితులు తలెత్తాయి. ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.


ఆ సమయంలో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించాలని నిర్ణయించింది. అయితే ఢిల్లీ సర్కారు మాత్రం దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఆక్సిజన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే కేంద్రం కేజ్రీవాల్ సర్కారుకు సమాధానం చెబుతూ.. ఎంత అవసరముందో అంతే ఇస్తాం. ఎక్కువ అంటే మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి. అక్కడ కూడా ప్రాణాలు పోతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అనేది చాలా ముఖ్యం. అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ ను కోరారు. అయినా ఆయన ససేమిరా అన్నారు. అయితే కేంద్రం దీనిపై అప్పట్లోనే లెక్కలు తీసింది. ఎంతమంది హాస్పిటల్ లో చేరుతున్నారు. ఎంతమందికి ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇలా లెక్కలు వేసుకుని కొంచెం ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తుంది.


అయితే కేజ్రీవాల్ సర్కారు తీరుతో ఆక్సిజన్ ఢిల్లీకే ఎక్కువ సరఫరా చేయాల్సి వచ్చింది. దాదాపు ఒక వంతు ఆక్సిజన్ అవసరముంటే నాలుగు వంతుల ఆక్సిజన్ తీసుకున్నట్లు సుప్రీం కోర్టు ఆడిట్ ఫ్యానెల్ ఈ విషయాన్ని బయటపెట్టింది. అప్పటికే దేశ వ్యాప్తంగా ఊపిరందక చనిపోతున్న వారి సంఖ్య ఇంత దారుణంగా ఉంటే ఆక్సిజన్ ను నాలుగు వంతుల ఎక్కువగా తీసుకుని దాన్ని స్టోరేజ్ చేసుకున్న కేజ్రీవాల్ పై ఎలాంటి కేసులు పెడతారు. ఆయనకు ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా? ఎందుకంటే ఆక్సిజన్ ను దాచి పెట్టడం అంటే మరొకరి ప్రాణాలు తీసినట్లే సమానం అంటున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: