బిగ్ బాస్ -10 లో క్రేజీ హీరోయిన్ ఎంట్రీ..?

Divya

బిగ్ బాస్ షోకి  తెలుగులో ఎంత క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు 9 సీజన్లను  విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్-10 రానుంది. దీంతో ఈ సీజన్లో పాల్గొనేవారు ఎవరనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదల చేయగా , ఆసక్తి పెంచేస్తోంది. గత సీజన్ మాదిరే ఈసారి కూడా సామాన్యులకు అవకాశం కల్పించే విధంగా అగ్ని పరీక్షలు నిర్వహించనున్నారు. గత సీజన్ కంటే పదవ సీజన్ చాలా భిన్నంగా ఉండనున్నట్లు సమాచారం. ఈసారి కూడా ఎప్పటిలాగే నాగార్జున హోస్టుగా వ్యవహరించనున్నారు.


బిగ్ బాస్ 10 లో కొంతమంది సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒక హీరోయిన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు కస్తూరి. అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇమే ప్రస్తుతం సీరియల్స్లలో రాణిస్తోంది. అంతేకాకుండా పలు రకాల వివాదాలలో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. నటి కస్తూరి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలలో సీరియల్స్లలో నటిస్తున్నారు.


మరి బిగ్బాస్ సీజన్ 10 లోకి అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈమె తమిళ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నారు. నటి కస్తూరి తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి అందులో సీరియల్ యాక్టర్ పల్లవి గౌడ, నూకరాజు, తేజస్విని గౌడ, హరి, జ్యోతి, రాకింగ్ రాకేష్, యాటిట్యూడ్ సార్ చంద్రహాస్, మరి కొంతమంది యూట్యూబర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయం పైన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సింది. అలాగే మరి కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ ని కూడా ఈసారి ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: