హెరిటేజ్‌ పోయి.. అమూల్‌ వచ్చాక.. జగన్‌ ఏం చేశాడు?

గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హెరిటేజ్ సంస్థ ఇక్కడ  పాల సేకరణ వ్యవస్థలు అన్నిటిని దెబ్బ తీసిందని అంటారు. ఈ పాల సేకరణ వ్యవస్థను ప్రైవేటుకి ఇచ్చేయడం జరిగింది అప్పుడు. దాంతో ఆ పాల సీకరణ వ్యవస్థ లోని జనాలందరూ ఒక్కటై పాల ధరలను పెంచేయడం జరిగింది. తద్వారా పాడి పరిశ్రమలు కూడా దెబ్బ తినడం జరిగింది . అయితే ఇదంతా జగన్ రాక ముందు.


జగన్ వచ్చిన తర్వాత అమూల్ సంస్థను తెర పైకి తెచ్చారు. అమూల్ తెర పైకి రాకముందు దానిని రానివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగాయని  తెలుస్తుంది.‌ అయినా కూడా అమూల్ ను ఆపలేకపోయారు. దానిని ప్రభుత్వం ఇంకా నడుపుతుంది. అయితే అమూల్ వచ్చాక ఎనిమిది సార్లు పాల సేకరణ ధరలు పెంచింది అని తెలుస్తుంది. అయితే అమూల్ తో పోటీ పడి ప్రైవేట్ సంస్థలు మూడుసార్లు పాల ధరలు పెంచాయని అంటున్నారు.


అయితే పాడి రైతుకు  దీని వల్ల ఎంత లాభమో తెలియదు గానీ వినియోగదారులకు మాత్రం ఈ ధరలు తలకు మించిన భారం అవుతున్నాయి. గతంలో పాతిక 30 రూపాయలు ఉన్న అర లీటర్ పాల ప్యాకెట్ ఇప్పుడు దాదాపుగా 40-45 రూపాయలు వరకు పెరిగి పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే ఈ ధర 50 రూపాయలు వరకు చేరుకుందని సమాచారం. కొంత మంది నిరక్ష రాస్యులకు  ఇన్ని కంపెనీల పేర్లు తెలియక పోయినా వారు కనిపించే పాల ప్యాకెట్  కవర్ కలర్ ని బట్టి ఎర్ర ప్యాకెట్టు, నీలం ప్యాకెట్టు అంటూ  పిలుస్తూ ఉన్నారు.  


వినియోగదారుల దగ్గర పాల ధర పెంచడం ద్వారా రైతులకు లాభం చేకూర్చడం అనేది ఒకరకంగా చూస్తే  మంచిదే. కానీ రైతులకు లాభం చేకూర్చే పేరుతో వినియోగదారులపై అదనపు భారాన్ని వేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అడుగుతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: