దూకుడుగా జనసేనాని.. గాడిన పడినట్టేనా?
రెండో అంశం పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూముల్ని కబ్జా చేసి దోపిడీ చేస్తున్నారో వారిపై పోరాడాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వ భూములన్ని ఎంచక్కా కబ్జా చేసేవారు. ప్రస్తుతం రాజకీయ దోపిడీ కూడా రూటు మార్చి ప్రైవేటు భూములను కూడా కబ్జా చేస్తున్నారు. రాయలసీమలో కూడా ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్ లో భూములు ఉన్నట్లయితే అక్కడ కబ్జాదారులు వాలిపోతున్నారు.
అమాంతం భూముల్ని కబ్జా చేసి అక్కడ పాగా వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా భూములను కబ్జా చేస్తున్న వారిపై ప్రశ్నించే వారు కరవయ్యారు. వివిధ డిపార్టుమెంట్లను అడ్డు పెట్టుకుని ఎలాగైనా ఆ భూములని కొట్టేస్తున్నారు. రూ. కోట్ల విలువ చేసే భూములు లక్షల్లో ఇచ్చేసి కాదు కూడదంటే దాడులకు దిగడం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి .
కాబట్టి పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఇదొక మంచి మైలేజీగా నిలిచిపోతుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ చేసే ఈ భూపోరాటానికి ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే సామాన్యులు కానీ ఆయా సంస్థలు కష్టపడి కూడబెట్టుకుని సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న జాగలను ఇలా ఈజీగా కొట్టేయడం సరికాదని ప్రజలు భావిస్తున్నారు. పవన్ భూ కబ్జాలపై పోరాటం కొనసాగిస్తూ ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటే ఆయనకు పార్టీకి లాభం చేకూరుతుంది.