ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?

2018 తర్వాత అప్పటి వరకు ఎన్డీఏ లో ఉన్న తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు చంద్ర బాబు నాయుడు ఎన్డీఏ నుండి బయటికి వచ్చేశారు. అప్పటివరకు భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీతో  ఉన్న పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి కమ్యూనిస్టులు అలాగే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ వాళ్లతో కలిసి ఎలక్షన్స్ లో పోటీ చేశారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్ర బాబు నాయుడు ఆలోచనల విషయానికొస్తే, చంద్ర బాబు అయితే మోడీని గద్దె దించి రాహుల్ ని ప్రధాని చెయ్యాలని అనుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాయా వతిని గద్దెనెక్కించాలని, మోడీని దింపేయాలని భావించారు. కానీ వాళ్ళిద్దరి ఆలోచన అయితే అప్పుడు నెరవేర లేదు. అయితే 2019 ఎలక్షన్లలో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం తో కలిసి  పొత్తును ఖరారు  చేసుకున్నారు.

కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడా కూడా పని చేసినట్టు కనపడ లేదు.  తిరుపతిలో  ఎన్నికల కోసం పోరాడినప్పుడు కలవడమే తప్ప ఇప్పటి వరకు తిరిగి కలిసిన జాడలు లేవు. అయితే ఇప్పుడు పురందేశ్వరి వల్ల వీళ్ళిద్దరి బంధం తిరిగి బలోపేతం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని వాపోయారు పురందేశ్వరి దేవి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు ఆవిడ.

పంచాయతీలో నిధులు లేక అప్పులు చేసి సర్పంచులు నడిపిస్తున్నారని ఆవిడ అన్నారు. సర్పంచులు నిధులు లేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆ పాపం ప్రభుత్వానిదేనని ఆవిడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.  చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ పాపం అంతా ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఆమె ఆరోపించారు. ఈ ఆందోళనలకు జనసేన అలాగే బిజెపి ఇద్దరు కూడా మద్దతు ప్రకటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: