దేశంలో ధనవంతులు పెరిగిపోతున్నారా?
కానీ ఇప్పుడు ప్రతి బ్యాంకు అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ అయి ఉంది. ఎవరూ ఏ వ్యాపారం చేస్తున్నారు. ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఎవరికీ తెలియలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా కేవలం 24 లక్షల మంది మాత్రమే ఇన్ కం ట్యాక్స్ కట్టే వారు ఉంటే ప్రస్తుతం దేశంలో ఇన్ కం ట్యాక్స్ కట్టేవారు దాదాపు ఆరున్నర కోట్ల మంది వరకు అయ్యారు.. ట్యాక్స్ చెల్లిస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలో 2022-23 కు ఆరున్నర కోట్ల మంది నుంచి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వివరాలు తెలిపింది. సోమవారం ఒక్కరోజే 36 లక్షల మంది. ఐటీఆర్ ఫైల్ చేసినట్లు తెలిసింది. వ్యక్తులు, ఖాతాలు ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు పన్ను సమర్పించేందుకు జూలై 31 తేదీతో ముగిసింది.
చివరిరోజు నాటికి 1.7 కోట్ల మంది ఈ ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్ లు దాఖలు చేసినట్లు తెలిపింది. రిటర్నింగ్ ఫైలింగ్ పన్ను చెల్లింపుల కోసం తమ వెబ్ సైబ్ ను 24 గంటలు అదుపులో ఉంచినట్లు పేర్కొంది. కాల్స్, లైవ్ చాటింగ్ సోషల్ మీడియా ద్వారా పన్ను చెల్లించే వారికి అవగాహన కల్పించినట్లు చెప్పారు. గత సారితో పోల్చితే ఐటీ రిటర్న్ లు పెరగడం సంతోషించాల్సిన అంశమని తెలిపింది.