ఆ విషయంలో నిండా మోసం చేసిన జగన్‌?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పథకంలో మద్య నిషేధం చేస్తామని ప్రకటించారు. అందులో మొదట పర్మిట్ రూం లు ఎత్తేశారు. బెల్ట్ షాపులు తీసేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ దశల వారీగా మద్య నిషేధం కాస్త అది అటకెక్కింది. ప్రభుత్వం చేతుల్లోకి మద్యం దుకాణాలు తీసుకున్నారు. అయితే మద్య పాన నిషేధంలో భాగంగా మొదటి ఏడాది 20 శాతం, రెండో ఏడాది 13 శాతంగా చేశారు. అక్కడి నుంచి అది కూడా ఆగిపోయింది.

బార్లకు గతంలో చంద్రబాబు లైసెన్సులు ఇచ్చాడు కాబట్టి వాటిని ఇప్పుడు ఏం చేయలేమని చెప్పిన జగన్ ప్రస్తుతం కొత్తగా 840 బార్లకు లైసెన్సులు రెన్యూవల్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నాడు. ఇది కీలక పరిణామంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు వందల కొత్త బార్లు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపింది.  ఈ వేలం ద్వారా ఎక్సైజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఆగస్టు 31 2025 వరకు ఇవి నడుపుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉండగా నాన్ రిఫండబుల్ దరఖాస్తులు కూడా చెల్లించాలని తెలిపింది. దరఖాస్తులు సమర్పించేందుకు జోన్ల వారీగా పేర్లను తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ పట్నంలో 128 బార్లు ఏర్పాటు కాబోతుంది. గుంటూరు, విజయవాడ, నెల్లూరు జిల్లాలో కూడా అధికంగా బార్లు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.

జగన్ సర్కారు నవరత్నాల్లో ఇచ్చిన మాట ప్రకారం.. కచ్చితంగా ఈ సంవత్సరం మద్యపాన నిషేధం జరగాలి. కానీ అందుకు విరుద్దంగా కొత్తగా బార్లు తీసుకొస్తున్నారు. మరి వాటిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కేవలం అధికారంలోకి రావడానికే మద్యపాన నిషేధం ప్రకటించారని ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: