అంతరిక్ష యుగంలోనూ జాతి వివక్షకు అంతులేదా?

అమెరికాలో ఒక నల్లజాతీయుడైన దొంగను పట్టుకున్న సమయంలో తెల్లజాతీయుడైన పోలీసు వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం కావడం తెలిసిందే. అయితే దొంగను పట్టుకున్న సమయంలో తలపై బూటు కాలితో నొక్కి పెట్టి ఉంచడం వల్ల ఆ దొంగ మరణించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు పెల్లుబిక్కాయి. ముఖ్యంగా అమెరికాలో నల్ల జాతీయులను తొక్కి పడేస్తున్నారని వారిని సమాన హక్కులు లేవని వారిని కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని ప్రపంచంలోని అన్ని దేశాల్లో నిరసనలు, ధర్నాలు చేశారు. ప్రస్తుతం అలాంటి సంఘటన ఒకటి బ్రిటన్ లో చోటు చేసుకుంది.


బ్రిటన్ లోని ఒక నల్లజాతీయురాలిని బేడీలు వేసుకుని తన కూతురు ముందే అసభ్యంగా మాట్లాడటం అమర్యాదకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. ట్రాన్స్ పోర్టు కు సంబంధించిన ఛార్జీల విషయంలో జరిగిన గొడవలో నల్లజాతీయులైన మహిళకు బేడీలు వేసి తీసుకెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.


ఆ బస్సు టికెట్ తీసుకునే సమయంలో జరిగిన వివాదంలో నల్లజాతీయురాలిని అరెస్టు చేసి చేతికి బేడీలు వేసి మగ పోలీసులు తీసుకెళ్లడం ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా మండి పడుతున్నారు. మానవ హక్కులను హరిస్తున్నారని ముఖ్యంగా నల్ల జాతీయులపై వివక్ష చూపుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తం 14 మంది పోలీసులు ఉంటే ఇద్దరు ఆమెకు బేడీలు వేసుకుని తీసుకెళ్లడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. నల్లజాతీయురాలు బిడ్డకు రక్షణగా మాత్రం ఒక పోలీసు అధికారి కాపలా గా ఉన్నారు.


బ్రిటన్ లో జరిగిన ఈ ఘటనను చాలా మంది మహిళలు, నల్లజాతీయులు, వివిధ దేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఖండిస్తున్నారు. అంత పెద్ద దేశంలో మహిళ పోలీసులు లేరా అంటూ మండి పడుతున్నారు. ఇంత అభివృద్ది చెందిన దేశంలో మహిళలపై ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: