ఆ పాకిస్తాన్ ఆంటీ యమా ఖిలాడీ.. ఇవిగో రుజువులు?
అయితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆమెను విచారణ చేయగా ఆమె దగ్గర ఆశ్చర్యంగా ఐదు పాస్ పోర్టులు బయటపడ్డాయి. అయితే వాటిలో ఏవీ కూడా పిల్లల పాస్ పోర్టులు కాకపోగా ఆ 5 కూడా ఆమెవే అని తెలుస్తుంది. వాటిలో ఒక పాస్ పోర్టు పేరు, డీటెయిల్స్ ఏమీ లేకుండానే కేవలం ఒక స్టాంపు మాత్రమే వేసి ఉంది. గూడ చార్య కార్యకలాపాల నిమిత్తం పాకిస్తాన్ సైన్యం, విదేశాంగ శాఖ సహకారంతో ఈమెకు ఈ ఎక్స్ట్రా పాస్ పోర్టు లభించిందని తెలుస్తుంది.
అయితే సీమా దగ్గర ఉన్న 5 పాస్ పోర్టులు కూడా 5 వేర్వేరు పేర్ల మీద ఉన్నాయట. అంతే కాకుండా ఆమె దగ్గర 4ఫోన్లు కూడా ఉన్నాయని, వాటితో ఢిల్లీలోని కొంతమందితో ఆమె మాట్లాడిందని అంటున్నారు. ఆమె మాట్లాడిన కాల్ డేటాని ఇప్పుడు సేకరిస్తున్నారు. అంతే కాకుండా సీమా దగ్గర ఉన్న ఐడి కార్డులోని సమాచారానికి, పాస్ పోర్టు లోని సమాచారానికి సంబంధం లేదని అంటున్నారు.
సీమ తండ్రి అలాగే సోదరుడు కూడా సైన్యం లోనే ఉన్నారని ఆమె చెబుతుంది. అయితే ఆమె గూఢచర్యం చేస్తుండగా పట్టుబడలేదు కాబట్టి ఆమెను గూఢచారి అని అనలేము అని కొంతమంది తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె దగ్గర ఉన్న పాస్ పోర్టులు ఇంకా ఫోన్ కాల్స్ ఆధారంగా ఆమెను అనుమానిస్తున్నారు.