తెలంగాణ కంటే ఏపీ ఆ రెండు విషయాల్లో బెటర్‌?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కన్నా కూడా కేటీఆర్ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కేటీఆర్ నూతన ఆలోచన ధోరణితో ఉండే మనిషి. ఆ నవీన దృక్పథంతోనే ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ముఖ్యంగా నూతన సాంకేతికతను ప్రోత్సహించడంలో కేసీఆర్ కన్నా కేటీఆర్  ముందు  ఉంటారని అంటారు. అది ఆయనకున్న అతి పెద్ద ప్లస్ పాయింట్. మామూలుగా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య పోటీ ఉండాలి. అది కూడా అభివృద్ధిలో ఉండాలి.

అభివృద్ధి విషయంలో ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం పోటీ పడాలి. కానీ కేటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే రెండు విషయాల్లో వెనక్కి ఉన్నారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆర్టీసీ బస్సుల్లో ఎప్పుడో డిజిటల్ సిస్టం వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు కేటీఆర్. దీని వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సులో విధానం అనేది వేగవంతం అలాగే సులభతరం అవుతుంది. కాబట్టి కేటీఆర్ భేషజాలకు పోకుండా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళని సంప్రదిస్తే బాగుంటుంది అంటున్నారు రాజకీయ నిపుణులు.

రెండో విషయం వచ్చేసరికి గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఏదైనా  వాహనం కొంటే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నూతన వాహన కొనుగోలుదారులకు ఆ సమస్య ఉండదట. ఎందుకంటే ఒక బండి ఏ షాప్ లో కొంటే ఆ షాప్ లోనే రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. వాటికి సంబంధించిన పేపర్స్ మాత్రం ఆర్టిఏ ఆఫీసులో ఉంటాయి.

అభివృద్ధిలో అలాగే మెట్రో సిటీలతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ లో ఇలాంటి విధానం ఉండటం అత్యవసరం. సాధారణంగా తెలంగాణలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలు ఎక్కువగా కొంటూ ఉంటారు.  ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కొనే వెహికల్స్ కంటే కేవలం హైదరాబాదులో కొనే వెహికల్సే ఎక్కువగా ఉంటాయట. కాబట్టి ఈ విషయాల గురించి కేటీఆర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: