తానా.. ఇదేమి రాజకీయ తందానా?
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కానీ ఆయనకు తానా సభల నుంచి పిలుపొచ్చింది. ఆయన వెళ్లి అక్కడ ఏదో మాట్లాడితే తెలంగాణ లో వివాదం అయింది. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న ఆయనకు పిలుపు రావడం వెనక కారణం గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తి కావడం. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండడంతోనే ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. సీతక్కను కూడా తానా సభలకు పిలిచారు. ఈమె కూడా టీడీపీలో నే గతంలో ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరి ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. తానా సభలో సీతక్క పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది లీడర్లకు తానా నుంచి పిలుపు అందలేదు. ఒక వేళ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అందరికీ పిలుపు అందేదేమో.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరికీ ఆహ్వానం అందింది. కానీ ఆమె ఎన్టీఆర్ కూతురు కావడం వల్ల టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే అభిమానంతో ఆమెను పిలిచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సోము వీర్రాజు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆయనకు పిలుపు రాలేదు.
తెలంగాణలో ఉన్న అనేక మంది లీడర్లకు కూడా తానా నుంచి పిలుపు అందలేదు. అంటే అమెరికాలో ఉన్న తానా టీడీపీ అనుకూలంగా పని చేస్తున్నట్లు తెలుస్తోందని చాలా మంది ఆరోపిస్తున్నారు. మరి తానా దీనికి ఏం సమాధానం చెబుతుందో?