పవన్ దెబ్బకు జగన్‌ సర్కారు కదిలిందా?

పవన్ కళ్యాణ్ దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది. మకిలిపురం రాజోలు దగ్గర వారాహి యాత్రలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం కావడం తో ప్రభుత్వం వెనువెంటనే రోడ్లు వేయడానికి సిద్ధమైంది. మకిలిపురం రాజోలి దగ్గర ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి నడవలేని విధంగా మారాయి. దీంతో పవన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 15 రోజుల్లో రాజోలి మక్లిపురం ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేయకుంటే  నూతన రోడ్లను నిర్మించకుంటే తానే స్వయంగా రోడ్లను వేస్తానని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ అధికారులు దిగివచ్చి ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు.

ప్రజా క్షేత్రంలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సభలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంతోమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన సభలకు తరలివస్తుంటారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే చాలు లక్షల మంది వివిధ సభలకు వివిధ ప్రాంతాలకు తరలివచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అనుకూలంగా మాట్లాడటం, బీజేపీ కి అప్పుడప్పుడు అనుకూలంగా వ్యవహరించడంతో సరైన రాజకీయ విధానం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని మార్చుకొని పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలను నమ్మి జనసేన ప్రభుత్వం ఏర్పాటయితే ప్రజలకు ఏం చేస్తాం ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాం. యువతకు ఏ విధమైన అవకాశాలు ఇస్తాం అని చెబితే నమ్మే అవకాశం ఉంటుంది.

ప్రజా సమస్యల గురించి చర్చించడం వల్ల ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా చేయొచ్చు. ఒకవేళ ఆంధ్రాలో జనసేన గెలిస్తే చేసే కార్యక్రమాలు, చేపట్టే పథకాల గురించి అర్థమయ్యే విధంగా తన సభలలో చెప్పాలి. అదే సమయంలో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టాలి. ఇలా వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రజలకు వివరిస్తూనే జనసేన పార్టీ ఏం చేస్తుందనేది చెప్పాలి. అప్పుడు ప్రజలకు పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఏర్పడి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: