కొత్త రికార్డులు సృష్టిస్తున్న మోదీ?

తొమ్మిదేళ్ల కాలంలో భారత ప్రధాని అనేక దేశాలు పర్యటించారు. ఎన్నో రకాల ఒప్పందాలు చేసుకున్నారు. రక్షణ రంగం నుంచి వాణిజ్య రంగాల వరకు భారత్ ను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రయత్నించారు. ఈజిప్టులో అత్యంత గౌరవ పురస్కారాన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ నైల్ పురస్కారం అందుకున్నారు. ఇండియాలో భారత రత్న పురస్కారం ఎంత అత్యున్నమైందో ఈజిప్టులో నైల్ పురస్కారం కూడా అంతే గొప్పది. దీన్ని గతంలో ఆఫ్రికా ఖండానికి చెందిన నెల్సన్ మండేలా కు ఇచ్చారు.

అనంతరం భారత ప్రధానికి ఇవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. నరేంద్ర మోదీకి వివిధ దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలను అందించారు. అందులో పపువ న్యూ గినియా దేశం కంపెనియన్ ఆఫ్ ఆర్డర్ లోగో అనే ఆ దేశ అత్యున్నత పురస్కారం మోదీ అందుకున్నారు. ఫిజీ దేశం కంపెనియన్ ఆఫ్ ఫిజి అనే పురస్కారం ఇచ్చింది. రిపబ్లిక్ ఆప్ ఫాలో అనే కంట్రీ యబకల్ ఫాలో విబ్స్ జూనియర్స్ ఇచ్చారు.

భూటాన్ దేశం ఆర్డర్ ఆప్ ట్రెగ్ గాల్సో, అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్, బహ్రెయిన్ కింగ్ హమాద్ ఆప్ ప్రెసయిన్స్, గౌరవ పురస్కారం ఇచ్చారు. మాల్దీవులు రూల్ ఆఫ్ ఆర్డర్ డిస్టింగిష్ నిషాన్, రష్యా సెయింట్ ఆఫ్ అండ్యూ అవార్డు ఇచ్చింది. పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆప్ స్టేట్ పాలస్తీనా అనే అవార్డు అందజేసింది. అఫ్గానిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఏ గాజీ హమానుల్లా ఖాన్, సౌదీ అరేబియా దేశం అబ్దుల్లా జీజ్ ఆల్ సౌద్ అనే పురస్కారం ఇచ్చింది. ఈ దేశాలన్నీ భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి సత్కరించాయి.

50 ఏళ్లుగా ఇజ్రాయిల్ తో సంబంధం భారత్ కు లేదు. కానీ ఇప్పుడు ఆ దేశంతో కూడా సత్సంబంధాలు నెలకొల్పి గొప్ప దౌత్యవేత్తగా పేరుపొందారు. అందుకే ఆయనకు వివిధ దేశాలు అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: