బీజేపీకి అధికారం: ఈటల లెక్కలు ఫలిస్తాయా?
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న పాయింట్ మొదటిగా చెప్పుకొచ్చింది కూడా మేమే అని ఆయన అన్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ నినాదం తీసుకోవడం, కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగాయని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే తెలంగాణకు హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు, హైదరాబాదు తో కూడిన రాష్ట్రాన్ని ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వంలో విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధులతోనే తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం నడుస్తుందని ఆయన అన్నారు. అలాగే బిజెపికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం 17కి పైగా మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా రాష్ట్రాలకు భారీ ఎత్తున హైవేలను కూడా కేంద్రం నిర్మిస్తుంది అని ఆయన వివరించారు. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవడానికి ఉపయోగపడే విషయాలని ఆయన చెప్పుకొచ్చారు.
2004లో వైయస్సార్ చేసిన పాదయాత్ర అప్పటి ఎలక్షన్స్ లో ఆయన గెలుపుకు కారణం అయ్యింది. పాద యాత్ర వల్ల వచ్చిన సింపతి 2014లో చంద్ర బాబు నాయుడు, 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం అయ్యాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో బిజెపి కూడా అధికారంలోకి వస్తుందని ఆయన అంటున్నారు.