ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?
మరోసారి కుల, మత రాజకీయాలు శాసిస్తున్నాయి. ఒక్క సారి కులం గురించి ఆలోచించాలని చెబుతాడు. కానీ పవన్ కల్యాణ్ స్పష్టంగా తెలుగు మాట్లాడగలడు. జగన్ తెలుగు మాట్లాడటానికి పేపర్ చూసి చెబుతాడు. చంద్రబాబు నాయుడు అనర్గళంగా మాట్లాడతారు. ఎక్కడా కూడా గుక్కతిప్పుకోకుండా గంటల తరబడి స్పీచ్లు ఇవ్వగలడు. కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు.
దాంతో పాటు ప్రజలకు ఏం చేయగలడో చెబుతాడు. ఏ విధంగా ముందుకు వెళితే దాన్ని సాధించగలరో చూపెడతాడు. ఇలా ప్రతి ఒక్క విషయంలో క్లారిటీతో ఉంటాడు. లోకేశ్ తన స్పీచ్ విషయంలో కాస్త మెరుగుపడినా ఇంకా చాలా సాధించాల్సి ఉంది. తెలుగులో మాట్లాడటం వచ్చినా ఎక్కడ నోరు జారతారోనని కార్యకర్తలే భయపడే పరిస్థితి వచ్చింది.
పవన్ ఆవేశపూరితంగా, అర్థవంతంగా మాట్లాడినా దాంట్లో క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. అయితే ఆంధ్రలో మాత్రం రాబోయే రోజుల్లో మూడు పార్టీల మధ్య మాటల దాడి మరింత పెరగనుంది. కొన్నిసార్లు నాయకులే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు సీనియారిటీ ముందు పవన్, జగన్, లోకేశ్ మాట్లాడుతున్న తీరు తక్కువే. కానీ ఎన్నికల సమయం వచ్చే సరికి ఈ ముగ్గురు నాయకులు మరింత రచ్చ చేయనున్నారు. పవన్ ఆవేశంగా స్పీచ్ ఇవ్వడం, లోకేశ్ యువగళంతో దూసుకెళ్లడం, జగన్ ఎప్పటిలాగానే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వారికి ఎంత వరకు మేలు చేస్తాయో చూడాలి.