పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ నాలుగేళ్ల కోసారి పెళ్లాలను మార్చే వ్యక్తి  అని నిలకడ లేని మనిషి అని ఎద్దేవా చేశారు. పెళ్లాల గురించి కాకుండా సరైన విమర్శలు చేస్తే బాగుండేదని అనుకుంటున్నారు. పవన్ కు మూడు పెళ్లిళ్లు జరగాయన్న విషయం అందరికీ తెలిసిందే.


కానీ నాలుగో పెళ్లి అనేది చాలా మందికి తెలియదు. ఆ మధ్య వైసీపీ నాయకులు పవన్ మూడో భార్యతో ఉండటం లేదు. కేవలం నాలుగో భార్యను పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యక్తిగత ఆరోపణల వల్ల ప్రజల్లో చులకన కావడం తప్ప మరేదీ ఉండదని అంటున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా తక్కువేమీ తినలేడు. సొంత బాబాయ్ ను జగనే చంపించాడని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగత దూషణల వల్ల ఓరిగేదేమీ ఉండదు.


కానీ ప్రజల్లో వారి క్యారెక్టర్లను బ్యాడ్ చేసి తద్వారా ఓట్లను పొందాలని చూస్తున్నారు. దీని వల్ల వారికి కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. నిజంగా రాజకీయ నాయకులు విమర్శలు చేసినా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలగాలి. రాజకీయ విమర్శలు చేయడం వల్ల లాభం ఉంటుంది. జగన్ పై అక్రమాస్తుల కేసులు ఇన్ని ఉన్నాయి. కానీ వాటిపై ఏం చేశారని విమర్శిస్తే దానికి క్రెడిబిలిటి దక్కుతుంది. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు.


ఆయనకు రాజకీయలపై అవగాహన లేదని మాట్లాడితే దానికి సంబంధించి ఇబ్బంది ఉండదు. కానీ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు అనేవి చాలా డేంజర్. ఈ దూషణల వల్ల అనేక రకాలుగా పార్టీలు కూడా డ్యామేజ్ అవుతుంటాయి. సంస్కారవంతంగా మాట్లాడలేని నాయకులు రేపు ప్రజలను ఎలా పాలిస్తారని అంటున్నారు. రేపటి తరానికి ఇలాంటి మాటలే నేర్పుతారా అని ఆయా పార్టీల నాయకులను ప్రజలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: