ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

పెట్రోల్ , డిజీల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి పెరగడం, తగ్గడం జరుగుతుంది. వాటి పెరుగుదలను ముఖ్యంగా ఆయిల్ ఉత్పత్తి చేయలేని దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కానీ భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరించి క్రూడాయిల్ ను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకుంది.


కొన్ని దేశాల్లో పెట్రోల్, డిజీల్ 200 నుంచి 400 రూపాయల వరకు పలుకుతోంది. ఇలా జరగకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ ఇది విజయవంతం కాలేదు. మామూలు వాహనాల కంటే దాని ధర ఎక్కువ. దానికి కరెంట్ తో ఛార్జింగ్ చేయాలి. గంటల పాటు చార్జింగ్ పెడితే అది 100 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇస్తాయి. అవి అంతకు మించి వెళ్లలేవు.


కానీ కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం మొదలు పెట్టింది. ఇథనాల్ వాహనాల వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇథనాల్ వాహనాన్ని ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితీన్ గడ్కరీ వాడుతున్నారు. ఇథనాల్ వాహనాల తయారీని పెంచాలని కేంద్రం ఆశిస్తోంది. ఇథనాల్ తయారీకి ఇబ్బందులు ఉండవు. తక్కువ ధరకు ఉత్పత్తి అవుతోంది. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ వైపు మళ్లేలా చర్యలు తీసుకుంటోంది.


ఇప్పటికే అన్ని పెట్రోల్ బంకుల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ ను పెట్రోల్ లో కలుపుతున్నారు. పూర్తిగా ఇథనాల్ వాహనాల వైపు తయారీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇథనాల్ వాహనాల తయారీతో కాలుష్యం తగ్గుతుంది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాన్ని పెంచాలని భావించిన కేంద్రం. అవి కొన్ని ప్రాంతాల్లో పేలిపోవడం, కాలిపోవడం జరిగింది. దీంతో ఇథనాల్ తో తయారయ్యే వాహనాలు మార్కెట్ లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ECO

సంబంధిత వార్తలు: