పవన్‌కు ఛాలెంజ్.. అక్కడ పోటీ చేసి గెలుస్తారా?

2004 లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. ఈ కలయిక కలిసొచ్చి విజయం సాధించాయి. తర్వాత తెలంగాణ ఇవ్వాలని కేసీఆర్ కాంగ్రెస్ ను ఒత్తిడి చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటేనే గెలిచావు. దమ్ముంటే మళ్లీ కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలువు చూద్దాం అని కాంగ్రెస్ లీడర్  ఎం. సత్యనారాయణ రావు  సవాల్ విసిరారు. దీనికి కేసీఆర్ మా పార్టీ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. అని తన రాజీనామా సమర్పించారు.


దీంతో కరీంనగర్ ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఎం. సత్యనారాయణ రావు కాంగ్రెస్ నుంచి కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. సత్యనారాయణ రావు విసిరిన సవాల్ స్వీకరించి రాజీనామా చేసి ఛాలెంజ్ లో కేసీఆర్ నెగ్గారు. దీంతో కాంగ్రెస్ కు తెలంగాణలో ఎదురు దెబ్బ. తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది.


ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు కూడా ముద్రగడ పద్మనాభం ఇలాంటి ఛాలెంజ్ చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పవన్ కు రాజకీయాల్లో క్లారిటీ లేదని విమర్శించారు. అయితే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లే ఎక్కువ క్యాండిడేట్ ఎవరు నిలుచున్న వీరు వేసిన ఓట్ల ఆధారంగానే గెలుస్తారు. గతంలో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు.


భీమవరం లో కాపులు ఎక్కువగా ఉన్నా.. అక్కడ ఆయనకు వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని తెలుస్తోంది. కానీ రాబోయే ఎన్నికల్లో పవన్ సవాల్ కు ఎదురు నిలబడి పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముద్రగడ పద్మనాభంకు గతంలో ఎక్కువగా అభిమానులు, అనుచరగణం ఉండేవి. ఇప్పుడు అంత లేవు. కాబట్టి పవన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని పిఠాపురంలో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: