మోదీ అమెరికా పర్యటనలో అదొక్కటే అపశ్రుతి?

ఇటీవల అమెరికా లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. కానీ అమెరికా పార్లమెంటులో ఉన్న ఇద్దరు ముస్లిం ఎంపీలు నరేంద్ర మోదీ అమెరికాలో ఇవ్వబోయే ప్రసంగానికి తాము హాజరుకామని ప్రకటించారు. ఇద్దరు ముస్లింలు తమ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కాబట్టి లిబన్ ఓమర్, రషీదా క్లయబ్ అనే అమెరికన్ కాంగ్రెస్ ఎంపీలు మోదీ స్పీచ్ ను బాయ్ కాట్ చేశారు.

రషీదా అనే ఎంపీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కాకుండా మరో నేతను ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తోంది. రషీదా ఎక్కువ ముస్లిం సామాజిక ఓట్లు ఉన్న ప్రాంతం నుంచి గెలిచిన వ్యక్తి కావడం వల్లే ఇలా తన సామాజిక వర్గ ఓట్లు ఎక్కడ పోతాయో నని మోదీ మీటింగ్ రానట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ ఇద్దరు ఎంపీలు ఇండియాలో ముస్లింలకు రక్షణ లేదని మోదీ ముస్లిం స్వేచ్చను హరిస్తున్నారని కామెంట్ చేశారు.

దాదాపు ఈ ఇద్దరు ఎంపీల భావజాలం పాకిస్థాన్ కు చెందిన ముస్లింల లాగ ఉంటుందని చాలా మంది  అంటున్నారు. ప్రపంచంలోనే అగ్రనేతగా పేరొందుతున్న నరేంద్ర మోదీకి అమెరికా ఘన స్వాగతం పలికింది. బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు, దక్షిణ కొరియా అధ్యక్షుడికి మాత్రమే అధికారికంగా బైడెన్ స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. వీరిద్దరి సమావేశంలో అనేక ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత డెవలప్ కంట్రీలో మత పరమైన సాకులు చూపి మోదీ మీటింగ్ కు హాజరుకాకపోవడంపై వారికి పరమత సహనం లేదని, రెచ్చగొట్టే తత్వం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

కాబట్టి ఇద్దరు ఎంపీలు రానంత మాత్రాన మోదీ స్పీచ్ ఏం అమెరికాలో ఆగదు. బైడెన్ తో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కుచిల మనస్తత్వంలో మోదీ స్పీచ్ బహిష్కరించడం ద్వారా మరింత చులకన అవుతారని గ్రహించపోవడం వారి అవివేకమని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: