పాక్, చైనాలకు ఒకేసారి షాక్ ఇచ్చిన భారత్?
కానీ దీనికి చైనా అడ్డుపడుతోంది. ఉగ్రవాదికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి భద్రతా మండలిలో తన వీటో పవర్ ను ఉపయోగిస్తూ అడ్డుకుంటోంది. దీనిపై భారత్ మండిపడింది. ముంబయిలో దాడి జరుగుతున్న సమయంలో ఉగ్రవాది ఫోన్ లో ఎలాంటి సందేశాలు ఇచ్చాడు. దాని వల్ల ఎలా దాడి జరిగిందనే అన్ని ఆధారాలతో ఐక్య రాజ్య సమితి ముందు ఉంచింది. ఉగ్రవాదులతో మాట్లాడిన ఫోన్ రికార్డు సందేశాలను ఐక్యరాజ్య సమితికి ఇచ్చింది. ప్రతి విషయాన్ని ఐరాస క్షుణ్నంగా పరిశీలించింది. దీంతో చైనా విస్తుపోవాల్సిన పరిస్థితి. పాక్, చైనాల మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిన విషయమే.
కానీ దేశంలో దాడులు చేసి ఇంత మందిని పొట్టన పెట్టుకున్న వారికి వత్తాసు పలుకుతున్న చైనాకు ఎప్పుడు బుద్ది వస్తుందో తెలియదని ప్రపంచ మేధావులు అంటున్నారు. ఇలాంటి దాడి చైనాలో జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా కఠిన శిక్ష విధించాలని భారత్ పట్టుబడుతుంటే తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవడం సమంజసం కాదని అంటున్నారు.
చైనా ఇలా భారత్ పై కక్ష సాధింపు చర్యలు సాధించడం వెనక పాక్ ఉందని తెలుస్తోంది. చైనాకు ధీటుగా భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. చైనా భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక పోతుంది. కచ్చితంగా ఏదో విషయంలో అంతర్జాతీయంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ భారత్ అన్ని ఆధారాలతో ముంబయి ఉగ్రవాదిని శిక్షించాలని చెప్పడంతో డ్రాగన్ కంట్రీ కంగుతింది.