టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

గతంలో చాలా స్లోగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన స్పీడును పెంచిందని తెలుస్తుంది. జనసేనను తనతో పాటు కలుపుకొని వెళ్తూ ఉండటం, బీజేపీ, కమ్యూనిస్టులకు కూడా టచ్ లో ఉండడం చేస్తూ ఉంది ఇప్పటికే. అక్కడిదాకా బాగానే ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఎలాగూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల సోషల్ మీడియా ఉండనే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రజల్లో వైఎస్ఆర్సిపి పై నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావడంలో కూడా సక్సెస్ అయ్యారని తెలుస్తుంది.

మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ వెనకాల తెలుగుదేశం పార్టీ  పడుతుంది అన్నవాళ్లు కాస్త, ఇప్పుడు బిజెపి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుంది అనే ప్రచారానికి సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. కానీ నిజానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వైపుకి రావడానికి సంసిధ్ధతగా లేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న  తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది అని తెలుస్తుంది.

అది కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య రూపం లో తగిలిందని తెలుస్తుంది. అయితే ప్రచారం ప్రకారం ఇప్పటికే తెలుగుదేశం ఇంకా జనసేన ఆరుసార్లు ముఖాముఖి కలిసారని నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఇందులో మూడు సార్లు వాళ్ళు ముఖాముఖి కలిసిన విషయం జనాలకు తెలుసు. అయితే జనసేన పార్టీ వాళ్ళు 75 అడుగుతుంటే వీళ్ళు 20 ఇస్తానన్నారనే ప్రచారం జరిగింది.

అది కాస్త చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 40 సీట్లు ఇస్తానన్నారు అనే ప్రచారం ఇప్పుడు జరుగుతున్న వేళ తెలుగుదేశానికి పవన్ ఒక షాక్ ని ఇచ్చారు. తాజాగా పవన్ తన ప్రసంగం లో ప్రజల్ని ఉద్దేశించి తనను ముఖ్యమంత్రిని చేయమని, చేస్తే రాష్ట్రాన్ని మార్చి చూపిస్తానని చెప్పడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇప్పుడు షాకింగ్  కలిగించే విషయంగా మారింది.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని తన వైపుకు తిప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: