యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

కల్పితానికి, సహజత్వానికి ఎంతో తేడా ఉంటుంది. వెయ్యి మంది శత్రువులను కూడా ఒక్క హిరోనే అంతమొందిస్తాడు అది కేవలం సినిమాల్లోనే సాధ్యమవుతుంది. దాన్ని అందరూ చూసి ఆ హిరోకు అభిమానులుగా మారిపోతారు. నిజ జీవితంలో కూడా ఆ సిని హిరోలా ఉండాలని కలలు కంటారు. హిరోయిజాన్ని చూసి మురిసిపోతుంటారు. కానీ అది నటన అని కేవలం సినిమా అని మాత్రం గుర్తించలేకపోతున్నారు. దీని వల్ల నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సినిమాలో లాగా తీర్చుకుందామని పోతే చేతులు కాలి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.


నిజానికి, కల్పితానికి తేడాను గమనించడంలో పొరపాటు జరిగితే రాబోయేది పతనమే. అంటే ఓటమి చెందడం తప్పా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిజమేదో అబద్ధమేదో గుర్తించే స్థాయిని పెంచుకోవాలి.  అప్పుడే నిజ జీవితంలో సమస్యలను కూడా ఎదుర్కొని నిలబడగలుగుతాం..


కానీ ఉక్రెయిన్ పరిస్థితి ఇప్పుడు కల్పితానికి, నిజానికి మధ్య నలిగి రష్యాతో యుద్ధం వల్ల సర్వం కోల్పోతుంది. రష్యా ను ఓడించేంత శక్తి లేకున్నా.. పరాయి దేశాలను నమ్మి ముందుకెళ్లి ఎవరో సాయం చేస్తారని, ఎవరూ సాయం చేయకున్నా రష్యా లాంటి శక్తి ఉన్న దేశంతో యుద్ధానికి కాలు దువ్వి తీవ్రంగా నష్టపోతుంది. బాగ్ పుత్ లాంటి నగరాన్ని రష్యా పూర్తిగా కైవసం చేసుకుంది. అయినా బాగ్ పుత్ సమీపంలో ఉన్న అయిదు గ్రామాలను తిరిగి ఉక్రెయిన్ కైవసం చేసుకుని పూర్తిగా విజయం సాధించినట్లు భావిస్తోంది. కానీ దీన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఒప్పుకోవడం లేదు.


ఎందుకంటే యుద్ధం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్, రష్యాను ఓడిస్తామని గొప్పలు చెప్పుకోవడం పొరపాటు లాంటిదేనని నాటో దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అణ్వస్త్ర దేశంతో యుద్ధం అంటే మామూలు విషయం కాదు. రష్యా తన ఓపికను ఇంకా ప్రదర్శిస్తుంది. ఒకవేళ రష్యా గనక అణ్వస్త్ర దాడి చేస్తే చెప్పడానికి మాటలు చాలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: