హైదరాబాద్: అంబేడ్కర్‌ కల నెరవేరుతుందా?

దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఆశించినంత ఫలితాలు రావడం లేదు. హిందుత్వ నినాదంతో వెళ్లిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమిపాలై తీవ్ర అసహనంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు దక్షిణ భారత దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉండేది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేకుండా పోయింది. కాబట్టి దక్షిణ భారత దేశంలో బీజేపీ పుంజుకోవాలని సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.


అందులో భాగంగానే దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అని ఇటీవల బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయడం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయని చెప్పారు.  ఇది బీజేపీ  చెబుతున్న విధానం కాదు. రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరిచిన విషయమేనని కొత్తగా చెబుతున్నది ఏమీ కాదు అని తెలిపారు. ఢిల్లీ ఉండగా రెండో రాజధానిగా హైదరాబాదును ఎంచుకోవడానికి అంబేద్కర్ సూచించిన విధానాన్ని మరోసారి గుర్తు చేశారు.


దేశ రాజధాని ఢిల్లీ పై  పాకిస్తాన్ గాని చైనా గాని ఎప్పుడైనా విధ్వంసానికి పాల్పడితే చాలా దగ్గరగా ఉంటుందని అదే హైదరాబాద్ అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు గాని పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ గాని వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వారు ఏ ప్రిపరేషన్ చేసుకున్న అంతలోపు హైదరాబాదులో ప్రతి కదలికను ఈజీగా పసిగట్టేయచ్చని పేర్కొన్నట్టు చెప్పారు.


ముఖ్యంగా హైదరాబాద్ రెండో రాజధాని కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు చెన్నై,  కర్ణాటక బెంగళూరు కేరళ రాష్ట్రాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాసులు ఇష్టపడే అవకాశం ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో సరైన రాజధాని లేక ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: