గుడ్‌న్యూస్‌: ట్రాఫిక్‌ చలాన్లు మొత్తం మాఫీ చేసిన సీఎం?

రోడ్డుపైన జర్నీ చేసేవాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ ని పాటించాలి.  ముఖ్యంగా వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు ఈ రూల్స్ ని  అధిగమించకూడదు. అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ తో సంబంధం లేకుండా కొంతమంది, ఇంకా చెప్పాలంటే చాలామంది ప్రయాణికులు ఈ మధ్యకాలంలో వెళ్తూ ఉన్నారు. అయితే దానికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని పక్కకు ఆపి మరి ఫైన్స్ వేసే వారు. అది కూడా కొంత బిల్ రూపంలో వేసి మిగిలిన డబ్బుని పక్కకు తోసేసేవారు.


అయితే ఈ రకమైన అవినీతిని కంట్రోల్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సీసీ క్యామ్ సిస్టం పెట్టింది. ఎవరైనా రూల్స్ ని అతిక్రమిస్తే ఆటోమేటిక్ గా వాళ్లకి ఫైన్ పడిపోతుంది. వాళ్ళ ఫోన్ కి మెసేజ్ వచ్చేస్తుంది. అయితే ఆ విధంగా వాళ్ళకి పడే ఫైన్ మొత్తం కలిపి లక్షలలో కాదు, కోట్లలో వస్తున్నట్లుగా తెలుస్తుంది. చివరికి ఇది ఎలా తయారయింది అంటే ఫైన్ వేసేది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా ఉండడానికి. కానీ ట్రాఫిక్ రూల్స్  అతిక్రమించేసి, ఆ పై ఫైన్లు కట్టేసి మరీ వెళ్ళిపోతున్నారు.


ఇక ట్రాఫిక్ రూల్స్ పెట్టి ఉపయోగం ఏముంది అని కొంతమంది అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తూ ఉందని తెలుస్తుంది. ఇలా ప్రభుత్వానికి పైన్స్ రూపంలో వచ్చే సొమ్ము వందల కోట్ల రూపాయలు అని తెలుస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ఒక సంచలన ప్రకటన చేశారట.


అది ఏంటంటే ఇప్పటి వరకు ఒక ఐదేళ్ల నుండి వేసిన ఫైన్స్ చలానాలు అన్నిటిని రద్దు చేస్తున్నామని చెప్పింది అక్కడి ప్రభుత్వం. దీని ఫలితం 2024 ఎలక్షన్లలో అక్కడ పాజిటివ్ గా పడే అవకాశం ఉంది. అయితే మరో నాలుగు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే తరహాలో వెళ్లడం మంచిదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: