ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?
ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ కనక పేలితే కీయూ మొత్తం బూడిదగా మారిపోతుంది. గతంలో చెర్నోబిల్ అణు విద్యుత్ కర్మాగారం పేలిన ఘటనలో ఎంతో మంది రష్యన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉక్రెయిన్ జెపోజెజరియా అణు ప్లాంట్ ను దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తుంటే, కీవ్ లోని కెమికల్ ప్లాంట్ ను దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఇది ఎటు వైపు దారి తీస్తుందో తెలియడం లేదు.
మహా భారత యుద్ధ సంగ్రామంలో యుద్ధం 18 రోజులు సాగితే అందులో నియమ నిబంధనలు ఉంటాయి. యుద్ధం ప్రారంభం ప్రతి రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమై, సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపు కంప్లీట్ కావాలి. అయితే ఇలా యుద్ధం నియమ నిబంధనల ప్రకారం జరిగేది. యుద్ధంలో ప్రాణాలతో పట్టుబడిన సైనికుడిని శిక్షించకూడదు. కేవలం వారిని బంధించాలి. మహా సంగ్రామంలో యుద్ధం 18 వ రోజు చివరకు వచ్చే సరికి అర్ధరాత్రి వేళ కాగడ వెలుతురులో యుద్ధం జరుగుతుంది. దీనికి పరమాత్మ శ్రీకృష్ణుడిని కొంతమంది అడుగుతారు.
యుద్ధం నియమ నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోందని అడిగితే.. ద్వాపర యుగం సమాప్తం అయి కలియుగం ప్రారంభమవుతుందని కలియుగంలో యుద్ధంలో తరతమ, నియమ నిబంధనలేవీ వర్తించవు అని చెబుతారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్దం చూస్తే అదే అర్థమవుతుంది. తన దేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ పై దాడికి ఉక్రెయిన్ దిగుతుందంటే దానర్థం కలికాలమే కదా?