కేసీఆర్‌ ఫ్యామిలీకి చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు?

కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత తనదేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ధరణి విషయంలో కేసీఆర్ స్వార్థం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో ఆయన ఇటీవల ధరణిపై కేసీఆర్‌ చేస్తున్నవ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత.. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తే తమ కుట్ర ఎక్కడ బయట పడుతుందోనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భయపడుతున్నారని రేవంత్‌ రెడ్డి అంటున్నారు.

ధరణి భయంతోనే కాంగ్రెస్‌ పార్టీపై సీఎం తీవ్ర విమర్శలు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ధ్వవజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు భీమా పథకాలు ఆగిపోతాయంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ధరణి ఫిర్యాదుదారుల నుంచి వసూలు చేస్తున్న వెయ్యి రూపాయల రుసుం ఎక్కడికి పోతుందని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ 146.5 ఎకరాల భూదాన భూములను కొట్టేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నట్లు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

భూదాన్‌ భూములను కొట్టేసిన పాపంలో కేసీఆర్‌ కుటుంబానికి 30శాతం కమిషన్‌ వచ్చిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

కిషన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూదాన బోర్డుతోపాటు, రెవెన్యూ అధికారులు సైతం జిల్లా కలెక్టర్‌కు, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖలకు లేఖలు కూడా రాశారని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. ఆ గ్రామంలోని భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలోనే ఉన్నట్లు ధరణిలో పేర్కొనలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. కలెక్టర్లను మేనేజ్‌ చేసుకుని భూదోపిడీకి పాల్పడ్డారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: