పొత్తు: టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిందేనా?

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదరడంతో టీడీపీ నేతలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అమిత్ షా, చంద్రబాబు మీటింగ్ అనంతరం పొత్తులు అనివార్యం అని తెలుస్తోంది. తెలంగాణకు మాత్రమే కాదు. ఆంధ్రలో పొత్తు విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎలాగైనా ఓడించాలనేది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల బీజేపీ కాస్త నిరాశలో కూరుకుపోయినట్లుు తెలుస్తోంది.

ముఖ్యంగా బీజేపీ, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణలో గెలవకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  అసలైనటు వంటి అంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు త్యాగానికి సిద్ధం కావాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే 20 నుంచి 25 స్థానాలను కచ్చితంగా ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీకి 10 నుంచి 15 స్థానాల వరకు ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో కచ్చితంగా 40 నుంచి 45 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ స్థానాలను త్యాగం చేయక తప్పదు.

బీజేపీ కిందటి సారి 13 స్థానాల్లో పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో 175 స్థానాల్లో 40 నుంచి 45 స్థానాలు జనసేన, బీజేపీకి ఇవ్వాల్సిందే. గెలిస్తే జనసేన పార్టీ నుంచి ముగ్గురు, లేదా నలుగురు, బీజేపీకి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇవే కాకుండా ఎంపీ స్థానాల్లో కూడా కొన్నింటిని టీడీపీ వదులుకోక తప్పదు.

ఎందుకంటే పొత్తు అంశం వచ్చేసరికి రెండు నుంచి మూడు స్థానాల్లో నైనా టీడీపీ జనసేన, బీజేపీకి వదులుకోవాల్సిందే. దీంతో అధికారంలోకి రావడం ఏమో కానీ బీజేపీ, జనసేన పొత్తుతో ఎన్నో రోజుల నుంచి పార్టీకోసం కష్టపడినా వారికి టికెట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఎదురవనుంది. దీన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: