పాకిస్తాన్‌: ఇమ్రాన్‌ఖాన్‌ చాప్టర్‌ క్లోజ్‌?

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ రగిలించిన విద్వేష జ్వాలలు ఇంకా రగులుకుంటూనే ఉన్నాయి. అసలు పాకిస్తాన్ లో ఏ నిమిషం లో ఏం జరుగుతుందో కూడా అర్థం అవడం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇమ్రాన్ ఖాన్ మొదలుపెట్టిన అరాచకాన్ని కంటిన్యూ చేస్తూ ఆయనకు సంబంధించిన జనాలు దేశమంతా అల్లకల్లోలం చేశారు. నిజానికి ఇమ్రాన్ ఖాన్, సైన్యంపై మాటలతో దాడి చేస్తే, ఆయన జనాలు సైన్యంపై చేతల దాడి చేశారని తెలుస్తుంది.

దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన సైనిక కీలక అధికారి మునీర్  దాడులు చేస్తున్న జనాల్ని కనిపించిన వాళ్లని కనిపించినట్లు కాల్చి పడేయమని చెప్పి ఆర్డర్లు వేశాడట తన సైన్యానికి. అయితే వాళ్లందరూ మన ప్రజలు, మన ప్రజల్ని మనం ఎందుకు చంపుకోవాలి అంటూ సైన్యం ఆయన మాటని తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ఒకరకంగా తిరుగుబాటు చేసినట్లుగా తెలుస్తుంది.

ఇంకా చెప్పాలంటే సైన్యం మొత్తం అనేకన్నా సైన్యం లోని ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్లు అధికారంలో ఉన్న షాబా షరీఫ్ ని గద్దె దింపి మరీ ఇమ్రాన్ ఖాన్ ను గద్దె ఎక్కించడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక సైన్యంలో ఒక 176 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కోర్టు మార్షల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అసలు కోర్టు మార్షల్ అంటే సైనిక అధికారులే న్యాయవాదులుగా ఉండి సైన్యం లో జరిగే తప్పులకు తీర్పును ఇస్తూ ఉంటారు. అప్పుడు తమ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సింది అక్కడ సైనికులు. వాళ్లలో నిజాయితీ లేకపోతే శిక్షించాల్సింది అక్కడి సైనిక అధికారులు. ఆ సైనిక అధికారులకు అధికారాలు బాగా ఉండటంతో తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు కూడా అదే విధంగా పడుతూ ఉంటాయి. అయితే గతంలో ఇమ్రాన్ ఖాన్ ని కోర్టు మార్షల్ చేస్తాం అన్నటువంటి వాళ్లు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మనుషులను కోర్టు మార్షల్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: