జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

మొన్నటివరకు నారా లోకేష్ ని మీమ్స్ రూపంలో ఇంకా రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ వచ్చిన ప్రత్యర్దులు ఆయన తీరును చూసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి సంబంధించిన వారాహి యాత్ర ఆగిపోయినా సరే, నారా లోకేష్ మాత్రం ఇంకా తన పాదయాత్రని కొనసాగిస్తున్నారు. ఆయన ప్రారంభించిన పాదయాత్ర వంద రోజులు దాటి ముందుకు వెళుతుంది.

ఆయన ఈ వంద రోజుల్లో 1200 కిలోమీటర్ల పైనే పాదయాత్ర చేశారని తెలుస్తుంది. 1200 కిలోమీటర్ల పైగా పాదయాత్ర సాగుతున్నా నారా లోకేష్ ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం ఇంకా వేరే పార్టీల అందరి నోటా లోకేష్ మాటే వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో యువ నాయకులు అంతా లోకేష్ బాట పడుతున్నట్లుగా తెలుస్తుంది.

తాజాగా ఒకప్పుడు వంగవీటి కుటుంబానికి ఆప్తుడు ఇంకా జనసేన పార్టీకి స్నేహితుడు అయినటువంటి తోట నరేంద్ర ఇప్పుడు లోకేష్ తో కలిసి, అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లడానికి చూస్తున్నారని తెలుస్తుంది. నిజానికి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలా లేదా అని జనసేన కేడర్లో కొంత డైలమాలో ఉన్నా కూడా తోట నరేంద్ర మాత్రం  తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ పాదయాత్రతో పాటు సాగడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.

ఈ తోట నరేంద్ర అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ నెగ్గాలని ఒట్టు పెట్టుకుని మరీ జుట్టు పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకుల విషయంలో చాలా నిబ్బరంగా ఉంటారు. ఎందుకంటే తమకు ఏదైనా కష్టం వస్తే తమ నాయకులు తన వెనుక ఉంటారని ఒక నమ్మకం ఉంటుంది. అదేవిధంగా తాను  లోకేష్ చేస్తున్న యువ గళం పాదయాత్రలో  జనసేన పార్టీ తరపున, పూర్తిస్థాయిలో తాను కూడా పాల్గొంటానని ఆయన అంటున్నట్లుగా తెలుస్తుంది. ఇకపై జనసేన వాళ్లు పూర్తి స్థాయిలో ఈ పాదయాత్రలో పాల్గొంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: