ఇండియాకు గుడ్‌న్యూస్‌.. మనం చాలా బెటర్‌?

ఆర్థికపరమైన రేటింగ్ సంస్థలన్నీ కూడా అమెరికా దేశంలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ సంస్థలు అమెరికాకి మంచి రేటింగ్ ఇచ్చి మిగిలిన దేశాలకు ఎటువంటి రేటింగ్ ఇవ్వాలని విషయంపై పెంచాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 31.4 ట్రిలియన్ డాలర్ల అప్పు వరకు పెంచుకుంటూ పోయిన, పోతున్న అమెరికాకి మంచి రేటింగ్ ఇస్తాయి ఇవి.

అందుకనే ఎప్పటికప్పుడు అమెరికాను బ్రతిమాలుకుంటూ ఉంటాయి మిగిలిన దేశాలు. లాయాల్టీలు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. ఎందుకంటే దాని ఆధారంగానే ప్రపంచ బ్యాంకులో అప్పులు ఇస్తూ ఉంటాయి కాబట్టి. అయితే ప్రస్తుతం భారతదేశంపై అమెరికా మంచి అభిప్రాయంతోనే ఉన్నదని తెలుస్తుంది ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం అవసరం అని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది అది.

అలాగే మోడీ వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలను వేగం చేయడం వల్ల వచ్చిన మార్పులు  అతిపెద్ద ప్రయోజనం అని తెలుస్తుంది. వాటి వల్ల భారతదేశం వేగంగా డెవలప్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎస్ ఎన్ పి గ్లోబల్ రేటింగ్ సంస్థ భారతదేశానికి స్టాండర్డ్ రేటింగ్ బి బి పి ఇచ్చిందన్నట్లుగా తెలుస్తుంది. భారత దేశ ఆర్థిక మూలాల పటిష్టత రాబోయే రోజుల్లో, రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అభివృద్ధికి కారణం అవ్వబోతున్నాయని తాజా రేటింగ్ నివేదికలు తెలిపింది.

భారత్ కు దీర్ఘకాలానికి అత్యల్ప పెట్టుబడి గ్రేడ్ రేటింగ్  బిబిబి మైనస్ ను స్వల్పకాలానికి ఏ 3 విదేశీ స్థానిక కరెన్సీ రేటింగ్ ను ఎస్ ఎన్ పి ధృవీకరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనపరుస్తుందని ఎస్ ఎన్ పి తెలిపింది. ప్రస్తుతానికి కన్సల్టేషన్ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారీ రుణ భారాన్ని భారత ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. మరో రేటింగ్ సంస్థ బీచ్ కూడా బీబీబీ రేటింగ్ ఇచ్చిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: