జగన్ ఆశీస్సులు: తిరుమలలో ఆయనకు ఎదురు లేదా?
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు రమణ దీక్షితుల మాట వినేంత టైం లేదు. సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు ఈవో ధర్మారెడ్డి అయితే సరిగా చూసుకుంటారని నమ్మారు. రమణ దీక్షితులు తప్పా మిగతా ప్రధాన అర్చకులు ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలో కంటిన్యూ అవుతున్నారు. దీంతో అర్చకులు ధర్మారెడ్డికి అనుకూలంగానే ఉంటున్నారు. బ్రేక్ దర్శనాల విషయంలో భక్తులు కాస్త గుర్రుగా ఉన్నా ఆ విషయాలు జగన్ వరకు చేరకుండా ధర్మారెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
14 నెలలుగా తిరుమల దేవస్థానంలో నెలకు రూ.100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా హుండీల్లోనే వస్తుంది. దీంతో ధర్మారెడ్డిపై జగన్ కు మరింత నమ్మకం కలిగినట్లు తెలుస్తోంది. బ్రేక్ దర్శనాల్లో వచ్చిన మార్పుల వల్లే సొంత పార్టీ నాయకులకే స్వామి వారి దర్శన భాగ్యం ఈజీగా దొరకడం లేదు. పెరిగిపోతున్న భక్తుల రద్దీని అదుపులో పెట్టడంలో విఫలం అవుతున్నట్లే కనిపిస్తోంది.
పాత విధానాలను మార్చడం ద్వారా తిరుపతి లో కూడా ఎక్కువ మార్కెట్ జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కొండ పైన దర్శనానికి సరైన సమయం ఇచ్చి పైకి రావాలని చెప్పడం వల్ల పైన రద్దీని తగ్గించొచ్చు. కింద వేచి ఉంటున్న భక్తుల వల్ల తిరుపతి లో కూడా ఆదాయాన్ని పెంపొందింవచ్చని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. భక్తులకు, దేవుడి సౌకర్యాలు విషయం పక్కన బెడితే ఈవో ధర్మారెడ్డి మాత్రం స్థిరంగా అక్కడే ఉండేట్లు కనిపిస్తున్నారు. తిరుమలలో సామాన్య భక్తులకు వీలైనంత తొందరగా దర్శన భాగ్యం కల్పిస్తే మంచిదని కోరుకుంటున్నారు.