అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

అమెరికా రష్యాల మధ్య కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు. ఒకరిని ఒకరు చంపుకునే అంత కసి కూడా కనిపిస్తుంది. రష్యాని అడుగడుగునా అడ్డుకోడానికి ఒకవైపు యూరోపియన్ యూనియన్, ఇంకా మరోవైపు నాటోలతో కలిసి నాటకం ఆడుతుంటే, దానికి రివర్స్ గా ఇంకొక కూటమి కడుతున్న రష్యా మీద అమెరికాకి ఎడతెరిపిలేని కోపం వస్తుంది. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతుందని తెలుస్తుంది.


రష్యా మీద యుద్ధం అనే పేరు చెప్పి యూరోపియన్ యూనియన్ని  బకరాను చేసి ఆడుకుంటుంది అమెరికా. అమెరికా బ్రిటన్లు చేస్తున్న మోసం యూరోపియన్ యూనియన్ లోని ఇతర దేశాలు కనిపెట్టడం లేదు. కనిపెట్టిన ఒకరిద్దరినీ వాళ్ళు గట్టిగా దబాయించేస్తున్న దానికి ఏమి కలిసొస్తుంది. దీని ద్వారా వాళ్ళకి  ఆయిల్ సప్లై ఆగిపోయింది.


అమెరికానే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని ధ్వంసం చేసి చెడగొట్టి, ఆ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని అమెరికానే పగలగొట్టి మిగిలిన దేశాలు చేశాయి అని వాళ్ళ మీద అన్యాయంగా నెపాన్ని మోపింది అప్పట్లో. కానీ నిజం నిప్పులాంటిది కాబట్టి అది నికార్సుగా బయటకు వచ్చింది. అమెరికాయే దోషి అని ఇంచుమించుగా తేలిపోయింది. అయినా సరే అది అగ్ర దేశమని, అన్ని దేశాల కన్నా అదే అగ్ర దేశం అని అది కూడా భావించుకునే పరిస్థితి.


కాబట్టి భయపడటం తర్వాత, అసలు పైప్ లైన్ ని ధ్వంసం చేసింది తన సొంత వ్యాపారాన్ని, ఆయిల్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమే అని మిగిలిన దేశాలు అందరికీ తెలిసినా తనకు ఏమీ తెలియనట్టు సైలెంట్ గా వ్యాపారం చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అప్పటి నుంచి. ఇంతా చేసి అమెరికా దగ్గరే ఆయిల్  కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది అది. దీనివల్ల ధరలు పెరిగిపోయాయి. వీటన్నిటికీ కారణం అమెరికా.  లబ్ది పొందుతుంది అమెరికా. మీకు ఏం కలిసి వచ్చింది అని అడుగుతున్నాడు రష్యన్ డిఫెన్స్ మినిస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: