టీడీపీ, జనసేన పొత్తు లేనట్టే.. ఇదే సాక్ష్యం?
పవన్ ను కల్యాణ్ లాంటి వ్యక్తి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదుగా కనిపిస్తారని నాగబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని సీఎం చేసుకోవడానికి మనం అందరితో కలిసి పని చేయాలి. పవన్ ను సీఎం చేయడానికి క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ సీఎం అయితే రాష్ట్రాన్ని ఊహించని స్థాయిలో అభివృద్ది చేసే సత్తా ఆయనకు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి మహిళలకు, వృద్ధులకు జనసేన గురించి తెలియజేసేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలపై పెత్తనం ప్రదర్శిస్తున్న వైసీపీ నాయకుల ఆగడాలను ప్రజలకు తెలియజేసేలా ప్రయత్నాలు చేయాలని కార్యకర్తలకు నాగబాబు సూచించారు. వైసీపీ నాయకులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం విషయంలో తాను అందుబాటులో ఉంటానని నాగబాబు ప్రకటించారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. కాబట్టి అవి పూర్తయ్యే వరకు జనసేన పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని నాగబాబు ప్రకటించారు.
పవన్ కల్యాణ్ సీఎం కావాలని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ దాన్ని సాధించడంలో ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే జనసేన అధికారంలో వస్తుంది.