జగన్‌ లోపాలు.. బాబుకు ప్లస్‌ అవుతున్నాయా?

ఇప్పుడు అధికార పక్షంలో జగన్ ఉన్నారు. విపక్షంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అధికార పక్షమైనా, విపక్షమైనా రెండూ బలంగా ఉండాలి, లేకపోతే ప్రమాదం. తాజాగా చంద్రబాబు గారు ఒక వికలాంగురాలి తో సెల్ఫీ దిగి పెట్టడం పెద్ద వార్త అయింది. మచిలీపట్నం దగ్గర ఉండే కనీసం కదలని ఒక వికలాంగురాలి పెన్షన్ తీసేసారట. ఏమైందో గాని ఇంతకుముందు ఇచ్చేది కాస్త ఇప్పుడు తీసేశారు. ఎందుకు తీసేసారు, ఇదేం దుర్మార్గమంటూ ఆమెతో సెల్ఫీ దిగి మరీ అడిగారు చంద్రబాబునాయుడు. దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు  స్పందించారు.


విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్ అనే ఆమెకు ఇచ్చే పెన్షన్ ని తొలగించడానికి మనసు ఎలా వచ్చిందంటూ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, ఆమె అనర్హురాలు అని తేలడంతో ఆమె పెన్షన్ ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు.


కృష్ణాజిల్లా మచిలీపట్నం కు చెందిన 22 ఏళ్ల సీమా పర్వీన్ 2021 సెప్టెంబర్ వరకు దివ్యాంగ ఫించను అందుకుంది. కానీ ఆ తర్వాత రెండు కారణాల వల్ల ఆ పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేశారు‌ ఈ మేరకు ఆమెకు 2021 సెప్టెంబర్ లోనే నోటీసులు ఇచ్చారు. తొలగించడానికి మొదటి కారణం ఆమె గృహ విద్యుత్తు వినియోగం 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది. ఈ మేరకు మచిలీపట్నం  కార్పొరేషన్ నోటీసులు పంపి వివరణ కోరింది. 2021 సెప్టెంబర్ ముందు వరకు ఆమె గృహ విద్యుత్ వినియోగం 3 యూనిట్లు కన్నా తక్కువ ఉంది.


ఆమె పెన్షన్ తీసేయడానికి రెండో కారణం ఆమె కుటుంబానికి మచిలీపట్నంలో 2475 చదరపు అడుగుల ఆస్తి ఉంది. ఈ విషయం నవ శకం పోర్టల్లో స్పష్టంగా ఉంది. ఈ కారణంగా, ఈ కారణాల దృష్ట్యా మాత్రమే ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందట. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆ పెన్షన్ అనేటువంటిది వికలాంగురాలికి ఇచ్చేది అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: