బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?
17, 18 శతాబ్దంలో ఆఫ్రికా కరేబియన్ నుంచి, నార్త్ అమెరికాకి బానిసలను తీసుకెళ్లిన దాని మీద రీసెర్చ్ తో కొత్త డాక్యుమెంట్ తయారయ్యింది. కింగ్ విలియం-3 బానిసల అమ్మకానికి సంబంధించిన వ్యవహారం మీద మొట్టమొదటి వాడు. 1200 డాలర్లు ఆనాడు ఎడ్వర్డ్ కోస్టర్ అనేటువంటి స్లేవ్ ట్రేడర్ బానిసలను అమ్మేటువంటి వ్యక్తి నుండి డబ్బులు సంపాదించాడు. ఆ రకంగా ఆయనకు ఈ వ్యాపారంలో మొట్టమొదటి లాభం వచ్చినటువంటి విషయం ఈ రీసెర్చ్ లో తేలుతుంది. విలియం-3 కి చెల్లించినట్లుగా తేలింది.
2020లో యాంటీ రేసిజం ఉద్యమకారులు నిలదీసినటువంటి నేపథ్యంలో బ్రిటన్లో ఉన్న విగ్రహాన్ని కూడా కులదోసేయడంతో బ్రిటన్ లో ఉన్న రాజ కుటుంబం దానిపై విచారం వ్యక్తం చేస్తూ దానిపై విచారణకు ఆదేశించింది. కింగ్ చార్లెస్ దానికి అనుమతిచ్చాడు. రీసెర్చర్స్ ఇప్పుడు నిజమని తెలిపారు. బానిసల మీద పుట్టినటువంటి రాజరికం బ్రిటన్ రాజకీయం అనేటువంటిది ఇప్పుడు తేల్చారు.
ఇప్పుడు ఈ స్లేవ్ ట్రేడ్ దారుణం అనే వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి బాధ్యతగా రాజరికం కానీ రద్దు చేస్తుందా బ్రిటన్ రాజ ప్రభుత్వం, లేదంటే ఒక క్షమాపణ చెప్పి తప్పించుకుంటుందా అన్నది చూడాలి. బానిసల నెత్తురుని, కన్నీటిని పునాదిగా చేసుకని ఎదిగిన ఎంత సామ్రాజ్యమైనా ఎప్పుడో ఒకప్పుడు పతనం కాక తప్పదని వీళ్ళ ద్వారా ఇప్పుడు ప్రజల అర్థం చేసుకుంటున్నారు.