ఉక్రెయిన్ వార్: చెప్పుడు మాటలతో చెడిపోతోందా?
రష్యా పంపిన మిస్సైల్ ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఉక్రెయిన్ మిస్సైల్ కాస్త పోలండ్ లో ఇళ్ల మీద పడటం ఆందోళనకు గురి చేసింది. రివర్స్ ఎటాకింగ్ అనేది ఉక్రెయిన్ కు తెలీదు. ఇదే విషయంలో తప్పు చేసిన ఉక్రెయిన్ తన 142 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. డొనెట్క్స్ రీజియన్ లో ఈ ఘోరం జరిగిపోయింది. డొనెట్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన మిస్సైల్ అదుపుతప్పి వారి సైన్యాన్ని బలి తీసుకుంది. ఇంత జరుగుతున్నా రష్యా ఒక మెట్టు దిగి శాంతి చర్చలకు రావాలని ఆహ్వనిస్తున్న ఉక్రెయిన్ మాత్రం ససేమిరా అంటోంది. నాటో లో సభ్య దేశంగా చేర్చుకోవాలని ఉక్రెయిన్ ఇప్పటికీ నాటో దేశాలను అభ్యర్థిస్తూనే ఉంది. కానీ దీనికి నాటో దేశాలు అంగీకరించడం లేదు.
రాబోయే రోజుల్లో యుద్దం ముదిరితే యూరప్ దేశాలు, అమెరికా ఉక్రెయిన్ కు ఏ విధంగా సహకరిస్తాయో తెలియడం లేదు. కానీ ఉక్రెయిన్ మాత్రం మళ్లీ మళ్లీ అదే పొరపాటు చేస్తుందనేది స్పష్టమవుతోంది. శాంతి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఎందరు చెబుతున్నా పట్టు వీడకుండా రష్యా లాంటి పెద్ద దేశంతో యుద్ధం చేస్తూనే ఉంది. దాని పర్యవసానం ప్రపంచ దేశాలతో పాటు ఉక్రెయిన్ కూడా తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతుంది.