
లోకేశ్ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?
కిందటి సారి జగన్ ఎలా అయితే వైఎస్ పేరుతో పాదయాత్ర చేశాడు. ఎక్కడెక్కడ ఎలా స్పందించాలి. ఎవరికి టికెట్ ఇవ్వాలి. ఎవరి దగ్గర ఏమేం సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కరించాలి. ప్రభుత్వం వస్తే ఎలాంటి పనులు చేస్తామనే కోణంలో అన్నింటిని బేరీజు వేసుకుని ఎన్నికలకు వెళ్లారు. ప్రస్తుతం లోకేష్ కూడా తనను తాను నిరూపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో ఇవ్వకూడదో అనే నిర్ణయాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సీనియర్లను పక్కన బెట్టి యువకులకు ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీ మొత్తం లోకేశ్ చేతుల్లోకి వచ్చేసింది. ఓవరాల్ గా చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎలాగైతే క్షేత్రస్థాయి వరకు వెళ్లి కార్యకర్తలకు బూత్ పదవి లాంటి వి ఇవ్వడంలో ఆయన చొరవ చూపించారో, ఇప్పుడు లోకేశ్ కూడా పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడు కేవలం గౌరవధ్యక్షుడి లాగా మాత్రమే ఏదైనా కీలకమైన అంశం ఉంటేనే, అది ఆయన వద్దకు వచ్చినపుడు మాత్రమే లోకేశ్ కు సలహా ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్క అంశంలో లోకేశ్ రోజు రోజుకు పార్టీలో పట్టు పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా చేయాల్సిందే. లోకేశ్ పార్టీ లో పట్టు పెంచుని ప్రజల్లో అభిమానం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. పార్టీ శ్రేణులు కూడా లోకేశ్ ఎలా సహకరిస్తాయో చూడాలి.