శభాష్‌.. రైతులకు మేలు చేసిన మోదీ?

అది బాలేదు, ఇది బాలేదు అని ఎవరైనా విమర్శించవచ్చు కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని మార్చే వాడే నాయకుడు అవుతాడు. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన ఎరువుల విషయంలో చిత్ర విచిత్రమైన విధంగా, విత్తనాలు విషయంలో కూడా విచిత్రమైన విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇదివరకు గతంలో చూస్తే పరిష్కారం ఎప్పుడూ ఆలోచించలేదు అప్పుడు  ఉన్నవాళ్లు. క్యూ లో రైతులు గుండెపోటు వచ్చి పడిపోవడం శోష వచ్చి పడిపోవడం, చెప్పులను లైన్లో పెట్టడం జరిగిన పరిస్థితి చాలా మంది జనాలకు ఇప్పటికీ తెలుసు. అది అంత త్వరగా, ముఖ్యంగా రైతులు ఎవరూ మర్చిపోలేరు.


కానీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు అభినందించకుండా ఉండలేం. రైతులకు ఎరువులు, విత్తనాలు విషయంలో  మోడిపైన కోపం, వ్యతిరేకతా ఎంతైనా ఉండవచ్చు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత తొమ్మిది ఏళ్లలో ఇప్పుడు అలా ఎరువుల కోసం బారులు తీరినట్టు, విత్తనాల గురించి బారులు తీరినట్టు ఒక్కరోజు కూడా వినపడడం లేదు.  ఒకే కంపెనీ ఒకే ఎరువును రకరకాల ప్యాకెట్లలో ప్యాక్ చేసేసి, రష్యా నుంచి వచ్చేది ఒకే  ఎరువైనా, ఈ ఎరువైతేనే కరెక్ట్ అన్నట్లుగా ప్రాజెక్ట్ చేసేస్తూ ఆ ఎరువునే నాలుగైదు కంపెనీలు నాలుగు ఐదు పేర్లుతో ప్యాకింగ్ చేసి, ఎక్కువ ప్రచారం చేసుకునే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి  అమ్మతుండడం జరుగుతుంది.


ఇలా చేస్తుంటే ఇప్పుడు అదంతా ఒకే ఎరువు కింద ముద్ర వేసే పరిస్థితి. ఇప్పుడు ఆ ఎరువుల్ని వేరేవాటికి మళ్ళించేసుకొని వాడేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాటిని వేరే విధంగా మార్చకుండా వేపలో ముంచిన దాంతో ముద్ర వేస్తున్న పరిస్థితి. సబ్సిడీ ఒక బస్తా కి ₹2,000 దాకా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. తాజాగా విత్తన బస్తాపై ట్రూత్ ఫుల్ లేబుల్ అతికించి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల నాసిరకమైన విత్తనాలను కాకుండా మంచి విత్తనాలను రైతు అనేవాడు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: