చైనా అప్పుల ఊబిలో కూరుకుపోతోందా?

చైనా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. చైనా పూర్తి స్థాయిలో సంక్షోభంలో పడిపోతుంది. ఉక్రెయిన్, బెలారస్, పాకిస్థాన్, మంగోళియా, ఈక్వెడార్, శ్రీలంక, అర్జెంటీనా, వెనిజులా, ఇలా అనేక దేశాలకు ఎక్కువ అప్పులు ఇచ్చింది. 2000 సంవత్సరం  నుంచి అప్పులు ఇచ్చింది.
చైనా 240 బిలియన్ డాలర్లు వివిధ దేశాల వద్ద ఉండిపోయాయి. అవన్నీ చెల్లిస్తే చైనాకు అసలు అప్పే ఉండదు. కానీ ఆయా దేశాలు తామే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం. ఇప్పుడు చెల్లించలేం అని చేతులెత్తేస్తున్న పరిస్థితి. గత 22 ఏళ్లలో 128 సార్లు డబ్బులు ఇవ్వలేమని చెప్పేశాయి. 2021 సంవత్సరం నుంచి ఇలా ఇవ్వకుండా పోవడం ఎక్కువయ్యాయి.

వన్ రోడ్ వన్ బెల్ట్ విధానం వల్లే ఎక్కువగా వివిధ దేశాలకు అప్పులు ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు లోన్లు పొందిన వారు ఐఎంఎఫ్ దగ్గర నుంచి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వం అని చెప్పినా చైనా చేసేదేమీ లేదని తెలుస్తోంది. చైనాలోని వివిధ నగరాల్లో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు అయిపోయినా పరిస్థితి. శ్రీలంక, జాంబియాలు 6 నుంచి 7 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అక్కడ సంక్షోభంతో ఇఫ్పటికీ చెల్లించలేని పరిస్థితి.

చైనా 2020లో మొత్తంగా 1.5 ట్రిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది. ఇంత భారీగా అప్పులు ఇచ్చిన కారణంగా చైనాలో సొంత రాష్ట్రంలోనే ఇబ్బంది పడుతోంది. కొత్త అప్పులు ఇవ్వలేమని చెప్పింది. చైనా కు ప్రస్తుతం రూ.5 ట్రిలియన్ డాలర్లు అత్యవసరంగా ఉన్నాయి. కానీ వాటిని ఇవ్వలేని పరిస్థితి ఉంది. చైనా దాదాపు చాలా దేశాలకు అప్పులు ఇచ్చింది. వాటిని కట్టమని అడిగితే మాత్రం ఆ దేశాలు కట్టలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం చైనాలో వివిధ నగరాల్లో అప్పులు ఎక్కువయ్యాయి. అక్కడ డబ్బులు అవసరం ఉన్నాయి. కానీ చైనా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. చైనాకు వచ్చిన చిక్కులు ఎలా తొలిగిపోతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: