గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ప్రపంచానికి పరిపాలన నేర్పామని బ్రిటన్ దేశ పాలకులు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆ ప్రపంచానికి  పాలన నేర్పిన చోటే భారత్ సంతతి మూలాలున్న వ్యక్తి బ్రిటన్ కు ప్రధానమంత్రి అయ్యారు. ఆయనే రిషి సునాక్. బ్రిటన్ లో అంతర్భాగం అయినటువంటి స్కాట్లాండ్ దేశానికి పాకిస్థాన్ సంతతికి చెందిన హంజా యూసుప్  మార్చి 29, 2023 న స్కాట్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. లండన్ మేయర్ గా సాజిద్ ఖాన్ కొనసాగుతున్నారు.

ఇలా ఒక్కరేమిటి బ్రిటన్ ను పాలిస్తుంది. ఒక భారతీయుడు, ఇద్దరు పాకిస్థాన్ సంతతి కి చెందిన వారే అనడంలో సందేహం లేదు. కానీ తెల్ల జాతీయులు మాత్రం భారత్ కు పాలన వ్యవహరాలు తెలియవు. వారికి మేం నేర్పాం అని అంటారు. అంతకు ముందు వేల ఏళ్ల క్రితమే భారతదేశంలో రాజులు, రాజ్యాధికారాలు, యుద్ధాలు, అన్ని ఉండేవి. ప్రజలను రాజులు పరిపాలించే వారు. వీటిన్నింటి తర్వాత మాత్రమే బ్రిటిషర్లు ఇండియాను పాలించారు.

కానీ వీళ్లేదో పాలన నేర్పించినట్లు ఫీలవుతారు. బ్రిటన్ కు చెందిన విలియం చర్చిల్ దేశ స్వాతంత్య్ర సమయంలో ఇండియాకు స్వాతంత్య్రం ఇస్తే రాస్కెల్స్, రోగ్స్  పరిపాలిస్తారని అన్నారు. స్వతంత్ర భారతం చేతకాని వారికి ఇస్తున్నట్లు వివర్శించారు. కేవలం బ్రిటిషర్లకు మాత్రమే పాలన తెలుసుని అవహేళన గా మాట్లాడారు. ఇలా మాట్లాడిన వారి దేశంలో భారత దేశం నుంచి వెళ్లి స్థిరపడిన కుటుంబానికి చెందిన వ్యక్తి నేడు బ్రిటన్ పీఎంగా ఉన్నారు.

అచ్చం అలాంటి పరిస్థితిలోనే పాక్ నుంచి బ్రిటన్ వెళ్లి స్థిరపడిన పాకిస్థాన్ కు చెందిన హంజా యూసుప్ తాత. కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్లాడు. కానీ అక్కడే స్థిరపడిపోయాడు. ఇలా పరిపాలన చేతకాదు, రాదు అన్న వారినే, వాళ్ల దేశంలోనే భారత, పాకిస్థాన్ సంతతి వాళ్లు ప్రధానులుగా గెలిచి పాలన అందిస్తున్నారు. చర్చిల్ ఆత్మ ఎక్కడున్నా ఇది చూసి ఎంత బాధపడుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: