లక్షల కోట్లు సంపాదిస్తున్న మన ఆలయాలు?
ఆలయాల్లోని సంస్కార కేంద్రాల్లో పిల్లలకు సంస్కారం నేర్పడం, చదువు నేర్పడం, లలిత కళలు నేర్పడం చేసేవారు. అలాగే ధర్మ బోధన కూడా చేసేవారు. మంచిగా ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అని ధర్మభోధన కూడా చేసేవారు. అంతేకాకుండా ఆలయాల్లో పేదలకు ఆహారాన్ని కూడా ప్రసాదంగా ఇచ్చేవారు. ఉన్నవాళ్లు తమ సంపాదించిన సొమ్ముని ఈ అన్న దానకార్యక్రమాలకి కొంత విరాళంగా ఇచ్చేవారు. దాంతో పేదలకు ఆహార సమస్య ఉండేది కాదు
అయితే తర్వాత ఈ వ్యవస్థను కించపరుస్తూ, అవమానపరుస్తూ గుడికెళ్లడం అనేది ఏదో తప్పన్నట్టు, ఆ తరహా బట్టలు కట్టుకోవడం ఏదో తప్పు అయినట్లు యాంటీ హిందూ మెంటాలిటీ ఉన్నవాళ్లు ప్రచారం చేయడంతో ఆ వ్యవస్థ దూరమైపోయింది. ఇవాళ మళ్లీ కనబడుతుంది. ఆ మార్పుకు సంబంధించిన పర్యవసనం చూస్తే దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు సంబంధించిన దాన్ని బట్టి చూస్తే కనుక హిందూమత ప్రదేశాలకు సంబంధించి పర్యాటకల ద్వారా వచ్చినటువంటి ఆదాయం అక్షరాల1,34,543కోట్లు అట.
ముఖ్యంగా ఈ ఆలయాల వద్ద చూస్తే కనుక కర్పూరం,పసుపు, కుంకుమ అమ్మే వాళ్లు, ఇలా చాలా రకాల వ్యాపారాలు చేసి కుటుంబ పోషణ చేసుకునే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. తిరుపతి, కాశీ లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కూడా ఈ వ్యాపారాలనే వాటి ద్వారా చాలా కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. గతంలో ఒక వెలుగు వెలిగిన ఈ సంస్కృతి కేంద్రాలు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా తిరిగి వెలుగులోకి వచ్చాయన్న విషయం మాత్రం ఆశాజనకమే.