రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచిపోయింది. అయినా ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీన్ని ముగించకపోతే అది మరింత తీవ్ర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది. రష్యాను ఇటు ఉక్రెయిన్ ను మెప్పించి యుద్ధాన్ని విరమించేలా చేయడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. మరికొన్ని తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి.  ఎలాగైనా సరే శాంతి చర్చలతో యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చైనా అధ్యక్షుడు జన్ పింగ్ ఈమధ్య సమావేశం అయ్యారు. యుద్ధం ఇంతటి తో  ఆపితే బాగుంటుందని చర్చలు జరిపామని శాంతి కోసమే ఈ చర్చల్లో పాల్గొన్నట్టు చైనా పేర్కొంది. అటు ఉక్రెయిన్ కు జపాన్ ప్రధాని వెళ్లారు. ఇటు ఇరాన్ చైనా రష్యా నార్త్ కొరియాలు ఏకమైతే ప్రపంచానికే ప్రమాదం అని అమెరికా భావిస్తున్న తరుణంలో లేదు మేము శాంతి పెంపొందించాలని పుతిన్ తో  సమావేశమయ్యామని చైనా చెబుతోంది. అయితే ఇది అమెరికాకు నచ్చడం లేదు.

అమెరికా ఈ విషయంలో ఇంకా యుద్ధం కొనసాగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కు అండదండగా నిలిచి ఇప్పటికే ఎన్నో యుద్ద విమానాలను, యుద్ధ సామాగ్రిని అందించి ముందుకు సాగుతోంది. తద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో ఏడాది గడిచిన ఇంకా నిలబడి ఉంది. దీనికి కారణం అమెరికా యూరప్ దేశాలు అని అందరికీ తెలిసిన విషయమే.

ఈ యుద్ధ రంగంలో అనేక నగరాలు విధ్వంసకాండ కు గురయ్యాయి. చాలా నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అణు యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా ప్రపంచానికే ప్రమాదం పొంచి ఉంటుందని భావిస్తున్నారు. ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలని అటు చైనా, ఇటు జపాన్ ఇరు దేశాల అధ్యక్షులతో సమావేశమై శాంతి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరి యుద్ధం ఆగుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: