అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న జాదవ్ పాంసింగ్ 40 సంవత్సరాలు ఒక్కడే పోరాడి 550 ఎకరాలను అటవీగా వృద్ధి చేశాడు. ఈయనను అటవీ మనిషిగా పేరు సంపాదించాడు. 550 ఎకరాల బీడు భూమిని అటవీగా మార్చాడు. అయితే ఈయన స్పూర్తిదాయక కథను అమెరికాలోని స్కూళ్లో ప్రవేశపెట్టనున్నారు. అమెరికాలో గతంలో అధ్యక్షులు గొప్పవారని, రష్యాలో రాజులు వీరులని రోమ్ రాజ్యం ఇలా అనేక మంది రాజుల కథలు మన దేశ పాఠ్య పుస్తకాల్లో కనిపించేవి.

కానీ మనకు మాత్రం మన దేశంలో ఉన్న వీరుల గురించి పాఠ్య పుస్తకాల్లో ఉండేవని చాలా  తక్కువే తెలుసు. కానీ కాలం అన్ని తిరిగి ఇచ్చేస్తుంది అంటే ఇదేనేమో.. భారతీయుడికి సంబంధించి అమెరికా పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాల్సిన టైం వచ్చింది. భారత దేశ అటవీ మనిషిగా పేరు సంపాదించిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన జాదవ్ పాంసింగ్ జీవిత చరిత్ర ను అమెరికా స్కూళ్లలో పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులు చదువుకోనున్నారు.

నాలుగు దశాబ్ధాలు, నలభై ఏళ్ల పాటు ఒక్కడే కష్టపడ్డాడు. అమెరికాలోని బ్రిస్టల్ కనెక్టకట్ గ్రీవె హెల్త్ స్కూల్ 6 వ తరగతి విద్యార్థులు చదువుకోనున్నారు. 57 ఏళ్ల ఈ అస్సామీ రైతు సాధించిన ఘనతను ఎకాలజీ పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులకు స్పూర్తినిచ్చేందుకు ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టినట్టు గ్రీవె హెల్త్  స్కూల్ టీచర్ ప్రకటించారు. ప్రపంచంలో దృఢ సంకల్పం ఉంటే ఏదైనా ఒంటరిగానైనా మార్చవచ్చని తెలిపారు. తూర్పు అస్సామీలోని అజామీ ద్వీప ప్రాంతంలో కరువు ఉన్న ప్రాంతలోని 550 ఎకరాలను దట్టమైన అడవిగా మార్చాడు.

ప్రస్తుతం ఆ అడవిలో ఏనుగులు, ఖడ్గ మృగాలు, జింకలు, ఇతర అన్ని జీవులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తి గురించి అమెరికాలోని విద్యార్థులు పాఠ్యాంశంగా నేర్చుకోవడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నట్లు అమెరికన్లు భావిస్తున్నారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో కూడా ఇతని స్ఫూర్తి వంతమైన జీవిత కథనాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: